శాంసంగ్ రికార్డు స్దాయి లాభాలు...

Posted By: Staff

2011వ సంవత్సరానికి గాను నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ తయారీదారు నష్టాలను చవిచూస్తే, అదే స్మార్ట్ ఫోన్స్ విభాగంలో మరో తయారీదారైన సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ గెయింట్ శాంసంగ్ మాత్రం రికార్డు స్దాయి లాభాలను చవి చూసింది. ఇక వివరాల్లోకి వెళితే 2011వ సంవత్సరానికి గాను 35 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు జరిపి $4.5 బిలియన్లను ఆర్జించింది.

శాంసంగ్ మూడవ త్తైమాసికంలో 28 మిలియన్ల అమ్మకాలు చేయగా, నాల్గవ త్రైమాసికంలో 35 మిలియన్లు అంటే దాదాపు 7 మిలియన్ల అమ్మకాలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. మూడవ త్రైమాసికంలో 22శాతం లాభాలను ఆర్జించగా, నాల్గవ త్రైమాసికం(అక్టోబర్ -  డిసెంబర్)లో 73శాతం లాభాలను ఆర్జించింది. శాంసంగ్ అమ్మిన అమ్మకాలు హెచ్‌టిసి ఉత్పత్తులకు మూడింతలు వర్తించనున్నాయి.

అసలు శాంసంగ్ అమ్మకాలు ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి కారణం మాత్రం గెలాక్సీ సిరిస్ స్మార్ట్ ఫోన్సే కారణమని అంటున్నారు కంపెనీ వర్గాలు. ఆండ్రాయిడ్ మార్కెట్‌ని ఒక్కసారిగా అధిగమించేందుకు గాను, శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్మార్ట్ ఫోన్స్ తమవంతు సహాకారాన్ని అందించాయన్నారు. దీనితో పాటు శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'శాంసంగ్ గెలాక్సీ నోట్' స్మార్ట్ ఫోన్ విడుదలైన రెండు నెలలలోపే 1 మిలియన్ యూనిట్స్ అమ్మకాలు జరిపి రికార్డుని సృష్టించింది.

శాంసంగ్ రికార్డు స్దాయి లాభాలు...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot