శాంసంగ్ నుంచి మరో రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు

|

దక్షిణకొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఈ మధ్య ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. 5జీ సపోర్టుతో శాంసంగ్‌ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి పదేళ్లు అయిన సందర్భంగా గెలాక్సీ ఎస్10 సిరీస్‌‌ను ఆవిష్కరించింది. మొత్తంగా ఈ ఈవెంట్లో 5 కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌‌లోకి తీసుకువచ్చింది.

శాంసంగ్ నుంచి మరో రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు

 

గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ, ఎస్10 ఫోల్డ్, ఎస్10 5జీ పేరుతో వాటిని తీసుకొచ్చింది.మరి ఈ ఫోన్ల వేడి చల్లారక ముందే శాంసంగ్ మళ్లీ మరో రెండు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురాబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం..

లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం..

లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం శాంసంగ్ మరో రెండు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుందని తెలుస్తోంది.ఈ ఫోన్లు బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయని సమాచారం. ఇప్పటికే మార్కెట్లోకి దూసుకువచ్చిన ఫోల్డబుల్ ఫోన్ కి హువాయి మేట్ ఎక్స్ రూపంలో పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో శాంసంగ్ మరింతగా దూకుడును పెంచినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివరలో..

ఈ ఏడాది చివరలో..

ఈ ఫోన్లలో అనేక రకాల కొత్త ఫీచర్లను జోడించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అధునాతనంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా బ్లూమెరాంగ్ తెలిపింది. ఈ ఏడాది మొత్తంలో 1 మిల్లియన్ ఫోల్డబుల్ ఫోన్లను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గెలాక్సీ ఫోల్డ్ ప్రత్యేకతలు
 

గెలాక్సీ ఫోల్డ్ ప్రత్యేకతలు

ఈ ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు టాబ్లెట్ తరహాలో 7.3(18.5 సెంటీమీటర్ల) అంగుళాల స్క్రీన్ ఉంటుంది. సాధారణ స్థితిలో 4.6 అంగుళాల స్క్రీన్ కనిపిస్తుంది. ఒకేసారి మూడు యాప్‌లను వినియోగించుకునే మల్టీ టాస్కింగ్ సౌలభ్యం ఉంది.

రోయోల్స్ ఫ్లెక్స్‌పాయ్

రోయోల్స్ ఫ్లెక్స్‌పాయ్

ఇంతకుముందు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ 'రోయోల్స్ ఫ్లెక్స్‌పాయ్'తో పోల్చితే ఈ డివైస్‌లో ఒక మోడ్ నుంచి మరో మోడ్‌లోకి సులభంగా మారొచ్చు. ఈ ఫోన్ మరో ప్రత్యేకత 6 కెమేరాలను కలిగి ఉండడం. వీటిలో మూడు కెమేరాలు ఫోన్ వెనుక వైపు ఉంటాయి. ఒకటి ఫ్రంట్ కెమేరా. ఇంకో రెండు కెమేరాలు ఫోన్లో ఉంటాయి.

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు

గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్‌ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇది చేస్తుంది. మొత్తం ఆరు కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది .

7 ఎన్ఎం ప్రాసెసర్

12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ

16+8+12 ఎంపీ ఔట్‌ సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా

10+8+10 ఎంపీ ఇన్‌సైడ్‌ ట్రిపుల్‌ కెమెరా

4380 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రారంభ ధర దాదాపు రూ.1,40,000.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Preparing Two More New Foldable Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X