సామ్‌సంగ్ నుంచి 128జీబి హై స్టోరేజ్ ఫ్లాష్ చిప్స్!

Posted By: Prashanth

సామ్‌సంగ్ నుంచి 128జీబి హై స్టోరేజ్ ఫ్లాష్ చిప్స్!

 

టెక్నాలజీ విభాగంలో అగ్రస్థానాన్ని అధిరోహించిన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ సామ్‌సంగ్ 128జీబి సామర్ద్యం గల హై స్టోరేజ్ ఫ్లాష్ చిప్‌లను త్వరలో ఉత్ఫత్తి చేయనుంది. ఈ చిప్‌లను ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీలలో ఉపయోగిస్తారు. సామ్‌సంగ్ చేపట్టిన ఈ తాజా ప్రయోగం మెమరీ స్టోరేజ్ చిప్‌ల విభాగంలో సరికొత్త ఒరవడిని తీసుకురానుంది.

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఫ్లాష్ చిప్‌లు 64జీబి మెమరీ సామర్ధ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. రాబోయే ఈ 128జీబి ఫ్లాష్ చిప్‌లలో పెద్ద మొత్తంలో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్య వర్గాల సమాచారం మేరకు ఈ చిప్‌లలో 15 పూర్తి నిడివి హైడెఫినిషన్ సినిమాలతో పాటు అంతే నిడివి కలిగిన 8 వీడియో ఫైళ్లను స్టోర్ చేసుకోవచ్చట. 128 జీబి మెమరీ సామర్ధ్యం కలిగిన ఈ మల్లీమీడియా కార్డ్‌లను రాబోయే తరం స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేయునున్నారు. ఈ చిప్ డేటాను 140MB/sవేగంతో రీడ్ చేస్తుంది. రైటింగ్ స్పీడ్ 50MB/s.ముందు ముందు రాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ హై స్టోరేజ్ ఫ్లాష్ చిప్‌లను వినియోగించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot