భారత్‌లో సామ్‌సంగ్ 5జీ టెక్నాలజీ

5జీ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన డెవలప్‌మెంట్ పనులను బెంగుళూరులోని తమ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రారంభించింది.

|

5జీ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన డెవలప్‌మెంట్ పనులను బెంగుళూరులోని తమ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రారంభించినట్లు సామ్‌సంగ్ ఇండియా R&D ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ షా ఎకానికిమ్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.

Samsung R&D India division starts working on 5G technology

ఇదే సెంటర్‌లో Bixby వర్చువల్ అసిస్టెంట్ యాప్‌కు సంబంధించిన చివరి దశ డెవలెప్‌మెంట్ పనులు కూడా జరుగుతున్నట్లు దీపేష్ షా తెలిపారు. సామ్‌సంగ్‌కు సంబంధించి రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పేరుగాంచిన బెంగుళూరు కేంద్రంలో కంపెనీ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి కీలక పరిశోధనలు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 2న ఇండియాకి సెల్ఫీ కింగ్ oppo f5 స్మార్ట్‌ఫోన్..నవంబర్ 2న ఇండియాకి సెల్ఫీ కింగ్ oppo f5 స్మార్ట్‌ఫోన్..

ఇక్కడ రెండు రకాల అభివృద్ధి పనులు జరుగుతుంటాయని అందులో మొదటిది గ్లోబల్ ప్రొడక్ట్స్ కోసం కాగా, రెండవది ఇండియన్ కన్స్యూమర్స్‌కు అవసరమైన ఫీచర్స్ కోసమని అన్నారు. Bixby, Samsung Pay, UDS, S-Bike వంటి ఫీచర్స్‌ను భారతీయులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ఈ సెంటర్ సహాయపడుతుందని తెలిపారు.

కొత్త ఆఫర్లతో దుమ్మురేపుతున్న వొడాఫోన్, మళ్లీ రెండు..కొత్త ఆఫర్లతో దుమ్మురేపుతున్న వొడాఫోన్, మళ్లీ రెండు..

ప్రపంచవ్యాప్తంగా తమకున్న ముఖ్యమైన కస్టమర్‌లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఒకటని దీపేష్ తెలిపారు. జియోకు అవసరమైన బ్యాక్-ఎండ్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్ మొత్తాన్ని సామ్‌సంగ్ నెట్‌వర్క్ రూపొందించటం జరిగిందని ఆయన తెలిపారు.

బెంగుళూరు ఆర్ అండ్ డి సపోర్ట్ సెంటర్‌లోని చాలా మంది ఇంజినీర్లు ఈ ఇన్‌ఫ్రా‌స్ట్రక్షర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఇదే సమయంలో ఐఎమ్ఎస్, VoLTE టెక్నాలజీలతో పాటు ఇతర టెలికం ఫీచర్లను కూడా వీరే అభివృద్ధి చేసారని వివరించారు.

Bixby వర్చువల్ అసిస్టెంట్ యాప్‌ గురించి దీపేష్ షా మాట్లాడుతూ, ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 200కు
పైగా దేశాల్లో అందుబాటలోకి రాబోతోందని, యాప్ చివరి దశ అభివృద్ధి పనులను బెంగుళూరులో సెంటర్‌లో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇండియన్ మార్కెట్ విషాయానికి వచ్చేసరికి Bixby వర్చువల్ అసిస్టెంట్‌ ఫీచర్‌ను స్థానిక భారతీయ యాసలతో అడాప్ట్ చేయటం జరిగిందని, దీంతో అన్ని భాషల వారు ఈ వాయిస్ రకగ్నిషన్ ఫెసిలిటీని వివిధ ప్రాంతాల వారు వినియోగించుకునే వీలుంటందని తెలిపారు.

5జీ అంటే ఖరీదైన టెక్నాలజీ..

టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో ఉన్న జపాన్, అమెరికా వంటి దేశాలు 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ 5జీ నెట్‌వర్క్ పై ముమ్మర పరిశోధనలు మొదలుపెట్టేసాయి. 5జీ నెట్‌వర్క్ రూపకల్పన ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నప్పటికి 2020 నాటికి కమర్షియల్‌గా అందుబాటులోకి రావటం తద్యమని తెలుస్తోంది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అంత సలువైన విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు.

టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !

ఈ ఖరీదైన టెక్నాలజీకి సంబంధించి పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు లక్షల కోట్ల పెట్టుబడలతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడిన పాలసీలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 5జీ టెక్నాలజీ పై కృషి చేసేందుకు దిగ్గజ టెలికామ్ ఆపరేటర్స్ అయిన చైనా మొబైల్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్ బ్యాంక్‌లు సంయుక్తంగా GTI 2.0 పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసాయి.

Best Mobiles in India

English summary
Samsung has started work on 5G technology at its research and development center in Bengaluru.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X