MWC 2022 లో లాంచ్ అయిన ల్యాప్‌టాప్‌లలో దేని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా..

|

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2022 ఈవెంట్‌లో అనేక సంస్థలు తమ యొక్క కొత్త ప్రొడెక్టులను విడుదల చేసాయి. అందులో భాగంగా రియల్‌మి మరియు శామ్సంగ్ సంస్థలు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసాయి. రియల్‌మి బుక్ ప్రైమ్ పేరుతో విడుదలైన కొత్త ల్యాప్‌టాప్ గత సంవత్సరంలో లాంచ్ అయిన రియల్‌మి బుక్ స్లిమ్ యొక్క అప్‌గ్రేడ్‌లలో భాగంగా 11వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో మరియు 16GB వరకు RAM మరియు 512GB స్టోరేజీ ఫీచర్లతో వస్తుంది. అలాగే దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ బ్రాండ్ గెలాక్సీ బుక్ 2 సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ లైనప్‌లో గెలాక్సీ బుక్ 2 ప్రో, గెలాక్సీ బుక్ 2 ప్రో 360, గెలాక్సీ బుక్ 2 360, గెలాక్సీ బుక్ 2 బిజినెస్ మరియు గెలాక్సీ బుక్ 2 ఉన్నాయి. ఈ సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ మరియు మైక్రోసాఫ్ట్ కంపెనీ భాగస్వామ్యంలో భాగంమైన తాజా విండోస్11 ను కలిగి ఉన్నాయి. ధరలు మరియు స్పెసిఫికేషన్ల పరంగా ఏవి మెరుగ్గా ఉన్నాయో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి బుక్ ప్రైమ్, శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరలు

రియల్‌మి బుక్ ప్రైమ్, శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరలు

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్‌ యొక్క ధర విషయానికి వస్తే యూరప్‌లో 8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ ఆప్షన్ ధర EUR 999 (సుమారు రూ. 84,400)గా నిర్ణయించబడింది. అలాగే 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 1,099 (దాదాపు రూ. 92,800). ఈ ల్యాప్‌టాప్ రియల్ బ్లూ, రియల్ గ్రే మరియు రియల్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. శామ్సంగ్ ల్యాప్‌టాప్‌ల ధరల విషయానికి వస్తే గెలాక్సీ బుక్ 2 ప్రో $1,049.99 ధర ట్యాగ్‌తో ప్రారంభించబడింది. ఇండియా కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ. 78,800. గెలాక్సీ బుక్ 2 360 మోడల్ $899.99 (రూ. 67,600) ధర ట్యాగ్‌తో, గెలాక్సీ బుక్ 2 ప్రో 360 మోడల్ ధర $1,249.99 (రూ. 93,900) చివరిగా గెలాక్సీ బుక్ 2 బిజినెస్ మరియు గెలాక్సీ బుక్ 2 ధరల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

రియల్‌మి బుక్ ప్రైమ్ స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి బుక్ ప్రైమ్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి కొత్త ల్యాప్‌టాప్‌ రియల్‌మి బుక్ ప్రైమ్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది విండోస్ 11తో రన్ అవుతూ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. కొత్త ల్యాప్‌టాప్ 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది హుడ్ కింద 11వ Gen Intel కోర్ i5-11320H ప్రాసెసర్‌తో పాటు Intel Iris X గ్రాఫిక్స్ మరియు 16GB వరకు RAM మరియు 512GB SSD స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. కొత్త రియల్‌మి ల్యాప్‌టాప్ వేడిని వెదజల్లే వేగాన్ని పెంచడానికి VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే డ్యూయల్-ఫ్యాన్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ 32 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని రియల్‌మి పేర్కొంది. ఆడియో విభాగంలో ఇది DTS ఆడియో టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్ టచ్‌ప్యాడ్‌తో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా ప్యాక్ చేస్తుంది. ఇందులో Wi-Fi 6 మరియు Thunderbolt 4 పోర్ట్‌తో కూడిన కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. ఇది Realme PC Connectతో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది ఒప్పో మరియు రియల్‌మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్‌లను వారి PCలతో వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఒక్క ఛార్జ్‌పై 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదని Realme తెలిపింది. ల్యాప్‌టాప్ 14.9mm మందం కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ బ్రాండ్ యొక్క కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లలోని గెలాక్సీ బుక్ 2 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 13.3-అంగుళాల మరియు 15.6-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే ఎంపికలతో వస్తుంది. ఇది Windows 11తో రన్ అవుతూ 32GB వరకు LPDDR5 RAM మరియు 1TB వరకు NVMe SSD స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి ఉండి తాజా ఇంటెల్ కోర్ i7 మరియు Core i5 ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది డాల్బీ అట్మోస్, 5G కనెక్టివిటీ, Wi-Fi 6E మరియు బ్లూటూత్ 5.1తో డ్యూయల్ స్టీరియో 4W స్పీకర్లతో వస్తుంది. 13.3-అంగుళాల మోడల్‌కు 63Wh బ్యాటరీ మద్దతు ఉంది, అయితే 15.6-అంగుళాల మోడల్ 68Wh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 360 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 360 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 360 ల్యాప్‌టాప్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది టచ్‌స్క్రీన్ సపోర్ట్‌తో 13-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉండి Windows 11లో రన్ అవుతుంది. పరికరం Intel Core i7 మరియు Core i5 ప్రాసెసర్‌లతో పాటు 16GB వరకు LPDDR5 RAM మరియు 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందించబడుతుంది. పరికరం USB టైప్-C పోర్ట్ ద్వారా 65W ఛార్జింగ్‌కు మద్దతుతో 68Wh బ్యాటరీతో మద్దతునిస్తుంది. ల్యాప్‌టాప్‌లోని గుర్తించదగిన ఫీచర్లలో డాల్బీ అట్మోస్, Wi-Fi 6E మరియు బ్లూటూత్ 5.1తో కూడిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung, Realme Brands Launched New Laptops at MWC 2022 Event: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X