నోకియాని స్వాదీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్న శ్యామ్‌సంగ్

Posted By: Super

నోకియాని స్వాదీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్న శ్యామ్‌సంగ్

మొన్నిటి వరకు నోకియాని మైక్రోసాప్ట్ స్వాదీనం చేసుకోబోతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో క్రొత్త రూమర్ వచ్చింది. ఈసారి మైక్రోసాప్ట్ స్దానంలో మాత్రం శ్యామ్‌సంగ్ ఉంది. ఫిన్ లాండ్‌లో వచ్చిన వార్తల కధనం ప్రకారం ప్రపంచంలో మొబైల్ సెక్టార్‌లో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి నోకియా కోసం స్వాదీనం చేసుకోవడానికి శ్యామ్‌సంగ్ కంపెనీ బిడ్ కూడా వేసినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో ఈవార్త ప్రచురించగా రెండు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం దీనిపై నోరుమెదపడం లేదు.

ఇక నోకియా విషయానికి వస్తే ప్రస్తుతం విండోస్ ఫోన్ డివైజెస్ మీద వర్కింగ్ చేస్తుంది. విండోస్ ఫోన్ డివైజెస్‌ని 2011 నాల్గవ క్వార్టర్‌లో విడుదల చేయాడనికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కాలంలో నోకియా స్టీమ్ లైన్ ఆపరేషన్స్‌కి సంబంధించిన 7,000మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ శ్యామ్‌సంగ్ గనుక నోకియాని స్వాదీనం చేసుకుంటే గ్యారంటీగా ప్రపంచంలో విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌‌లో ముందుకు దూసుకుపోగలదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

నోకియాని శ్యామ్ సంగ్ టేక్ ఓవర్ చేస్తున్న విషయాన్ని శ్యామ్ సంగ్ అధికారుల వద్ద ప్రస్తావించగా దీనిపై వారు మాట్లాడడానికి నిరాకరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot