శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+లలో డిస్నీ తరహా ఏఆర్ ఎమోజీలు సిద్ధం..

Posted By: M KRISHNA ADITHYA

ఎమోజీలు ఇప్పుడు చాటింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా ఇప్పుడు మెసేజింగ్ మొత్తం ఎమోజీల్లోనే నడుస్తోంది. వెయ్యి పదాల్లో చెప్పలేని భావం, ఒక్క ఎక్స్ ప్రెషన్ తో చెప్పొచ్చు అంటారు. మరి అలాంటిదే ఇప్పుడు ఎమోజీ. ఇప్పుడు తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 సిరీస్ లో సైతం సరికొత్త ఎమోజీలు దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్X తరహాలోనే యానిమోజీలను ఇప్పుడు ఎఆర్ ఎమోజీ పేరుతో శాంసంగ్ రిలీజ్ చేసింది. ఇందులో యూజర్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నే యానిమేటెడ్ రూపంలో పంపే వీలుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+లలో డిస్నీ తరహా ఏఆర్ ఎమోజీలు సిద్ధం

ఈ ఎఆర్ ఎమోజీల్లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. డిస్నీ కేరక్టర్స్ అయిన మిక్కీ, అలాగే మిన్నీ మౌస్ లను కూడా ఎమోజీలుగా ఎంపిక చేసుకునే వీలుంది. ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎమోజీల్లో డిస్నీ కారెక్టర్లయిన డొనాల్డ్ డక్, గూఫీ లాంటివి మీకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ను అందిస్తాయి.

మెగా సేల్స్‌తో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్

అలాగే ఈ ఏఆర్ ఎమోజీల ప్రత్యేకత విషయానికి వస్తే ఇవి మీ ఫేస్ ను రికగ్నైజ్ చేసి మీరు పెట్టే ఎక్స్‌ప్రెషన్స్ ను ఎమోజీలుగా మార్చే వీలుంది. మీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఈ ఎమోజీలను రూపొందించుకోవచ్చు. అయితే సాంసంగ్ గెలాక్సీ ఎస్9లోనూ,ఎస్ 9 ప్లస్ లోనే ఐఫోన్ ఎక్స్ తరహాలో ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ లేదు. ఇదే పెద్ద అడ్డంకిగా మారింది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం సాంసంగ్ మై ఎమోజీ పేరిట మరో ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.

ఇందులో భాగంగా ఇందులో మొత్తం 18 రకాల ఎక్స్‌ప్రెషన్స్ ను తయారుచేసుకునే వీలుంది. త్వరలోనే వీటి సంఖ్యను 54కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు యాప్ ను అప్ డేట్ చేస్తూ మై ఎమోజీని మరింత నూతనంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

English summary
Samsung rolls out Disney-inspired AR Emojis for the Galaxy S9 and S9+ in India More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot