సీఈఎస్ 2014 వేదికగా సామ్‌సంగ్ నుంచి 105 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ టీవీ

Posted By:

లాస్‌వేగాస్‌లో మంళవారం ప్రారంభమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2014ను పురస్కరించుకుని సౌత్ కొరియన్ టెక్‌దిగ్గజం సామ్‌సంగ్ 105 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ టీవీని ఆవిష్కరించింది. ఈ అతిపెద్ద టీవీతో సహా యూ900 సిరీస్ నుంచి 65 అంగుళాలు, 55 అంగుళాల వేరియంట్ లలో వంపు తిరిగిన టీవీలను ఆవిష్కరించింది.

సీఈఎస్ 2014 వేదికగా సామ్‌సంగ్ నుంచి 105 అంగుళాల టీవీ

మరో వైపు ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జి అత్యాధునిక ఫీచర్లతో కూడిన అల్ట్రా హైడెఫినిషన్ టీవీలను సీఈఎస్ 2014 వేదికగా ఆవిష్కరించింది. సీఈఎస్ వేదిగా ఎల్‌జి ఆవిష్కరించిన ఉత్పత్తుల జాబితాలో 105 అంగుళాల 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ, 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ, 77 అంగుళాల ఫ్లెక్సిబుల్ వోఎల్ఈడి టీవీలు ఉన్నాయి.

105 అంగుళాల 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ: వంపు తిరిగి ఉన్న 105 అంగుళాల స్ర్కీన్‌తో ఎల్‌జి రూపొందించిన 21:9 కర్వుడ్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీ సీఈఎస్ 2014కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 5120 x 2160 5కే రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉండే ఈ టెలివిజన్ సెట్ చూపరులకు సినిమాటిక్ అనుభూతులను చేరువ చేస్తుంది. అత్యాధునిక ఆడియో వ్యవస్థనను టీవీలో ఏర్పాటు చేసారు. టీవీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 7.2 మల్టీ ఛానల్ సౌండ్ వ్యవస్థను హార్మాన్ కార్డాన్ సంస్థ భాగస్వామ్యంతో ఎల్‌జి రూపొందించింది.

77 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి టీవీ... సీఈఎస్ 2014లో భాగంగా ఎల్‌జి 77 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి టీవీని ఆవిష్కరించింది. ఈ టీవీ తెరను వినియోగదారుడు రెండు విధాలుగా మార్చుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ఏర్పాటు చేసిన సింగిల్ బటన్ వ్యవస్థ ద్వారా టీవీ స్ర్కీన్‌ను ఫ్లాట్ లేదా కర్వుడ్ స్ర్కీన్‌గా మార్చుకోవచ్చు. ప్రీమియమ్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ.. సీఈఎస్ 2014లో భాగంగా ఎల్‌జి యూబీ9800 సిరీస్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీలను ఆవిష్కరించింది. ఈ టెలివిజన్ మోడల్ 65, 79, 84, 98 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot