Home
News

మార్చ్ 15 న లాంచ్ కానున్న, ఈ శాంసంగ్ ఫోన్ల ధర లీక్ అయింది! వివరాలు

By Maheswara

శాంసంగ్ గెలాక్సీ A34 5G మరియు గెలాక్సీ A54 5G త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అవుతాయని అంచనాలున్నాయి. ఇటీవల నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్‌లు గ్లోబల్ మార్కెట్‌లలో తమ అరంగేట్రానికి కేవలం ఒక వారం మాత్రమే దూరంలో ఉన్నాయి. గెలాక్సీ A34 5G మరియు గెలాక్సీ A54 5G మార్చి 15న లాంచ్ కానున్నాయి.

ఈ రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ఇతర వివరాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నారు, ఒక టిప్‌స్టర్ ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అంచనా ధరను కూడా లీక్ చేశారు. లీక్ అయిన ధరల వివరాల ప్రకారం శాంసంగ్ యొక్క రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌ లు 128GB స్టోరేజ్ మోడల్‌కు సంబంధించినవి.

Samsungs New Upcoming Phones Galaxy A54, Galaxy A34 Price Leaked Ahead Of The Launch. Details.

టిప్‌స్టర్ స్నూపీ టెక్ శాంసంగ్ గెలాక్సీ A34 5G మరియు A54 5G 128GB వేరియంట్‌ల ధరను లీక్ చేసింది. ఈ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, గెలాక్సీ A34 5G ధర 128GB వేరియంట్ కోసం EUR 419 (దాదాపు రూ. 36,600) అయితే గెలాక్సీ A54 5G ధర EUR 519 (దాదాపు రూ. 45,400). ఈ లీకైన ధరలు యూరప్‌లోని వినియోగదారులకు వర్తిస్తాయని అంచనా వేయబడింది. ఇంకా,ఈ ఫోన్లు తక్కువ ధరకు భారతీయ మార్కెట్లోకి లాంచ్ కావొచ్చని తెలుస్తోంది.

భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్లను లేదా వాటి లభ్యత సూచించే ప్రణాళికలను కంపెనీ ప్రస్తుతానికి ప్రకటించినప్పటికీ, ఇటీవలి నివేదికల ప్రకారం గెలాక్సీ A34 5G మరియు గెలాక్సీ A54 5G లను మార్చి చివరిలో భారతదేశంలో లాంచ్ చేయాలని చూస్తున్నట్లు అంచనాలున్నాయి.

అదనంగా, ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ A54 5G పూర్తి HD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో శాంసంగ్ యొక్క ఎక్సీనోస్ 1380 ఆక్టా కోర్ SoCని అమర్చవచ్చు. ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ తృతీయ సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ను తీసుకువస్తుందని అంచనా వేయబడింది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు IP67 రేటింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది

Samsungs New Upcoming Phones Galaxy A54, Galaxy A34 Price Leaked Ahead Of The Launch. Details.

మరోవైపు, గెలాక్సీ A34 5G ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుందని మరియు మీడియా టెక్ MT6877V ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్ తో పనిచేస్తుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు గమనిస్తే 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ తృతీయ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఇక, సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, ముందు వైపు ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో టియర్‌డ్రాప్ నాచ్‌ అమర్చబడి ఉంటుంది.5,000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుందని మరియు IP67 రేటింగ్‌ను కలిగి ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung's New Upcoming Phones Galaxy A54, Galaxy A34 Price Leaked Ahead Of The Launch. Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X