అక్టోబర్ 15..మెగా ఫ్యామిలీ నుంచి ఆ అధికారిక ప్రకటన?

Posted By: Super

అక్టోబర్ 15..మెగా ఫ్యామిలీ నుంచి ఆ అధికారిక ప్రకటన?

 

 

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ అక్టోబర్ 15న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం పట్ల టెక్ అభిమానులు మరింత ఉత్సకతతో ఉన్నారు. ఈ వేదిక పై సామ్‌సంగ్ విండోస్ 8 ఆధారిత గ్యాడ్జెట్‌లను అధికారికంగా ఆవిష్కరించనుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ కార్యక్రమంలో రెండు సరికొత్త అల్ట్రాథిన్ అల్ట్రాబుక్‌లను కంపెనీ ప్రదర్శిస్తుంది. విడుదల కాబోయే గ్యాడ్జెట్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విండోస్8 వోఎస్ కోసం పరితపిస్తున్న వారికి ఈ సరికొత్త గ్యాడ్జెట్‌లు వీనలవిందైన అనుభూతులను పంచుతాయని పలువురు వాపోతున్నారు. మరోవైపు ఆపిల్ రూపొందిస్తున్న ‘ఐప్యాడ్ మినీకి’ పోటీగా సామ్‌సంగ్ ‘గెలాక్సీ ఎస్3 మినీ’ పేరుతో సరికొత్త గ్యాడ్జెట్‌ను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా లెనోవో విండోస్ 8 అదేవిధంగా విండోస్ ఆర్‌టి వోఎస్‌ల పై స్పందించే సరికొత్త కన్వర్టబుల్ డివైజ్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot