Home
News

Galaxy A51 & Galaxy A71 మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో గోప్యతను పునర్మించిన Samsung

GenZ వంటి స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారుల యొక్క అభిరుచులు, ఆసక్తులు మరియు వారి యొక్క ఫ్యాషన్ ను స్టోర్ చేసుకోవడానికి రహస్య లాకర్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ పాకెట్ యొక్క అద్భుతాలు ఎంత ముఖ్యమో కొన్నిసార్లు అవి వారి యొక్క గోప్యతకు అతి పెద్ద హానిని కూడా కలిగిస్తాయి అని నిరూపిస్తాయి. సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌ను అడిగితే అది కొద్ది నిమిషాలు మాత్రమే అయినప్పటికీ 'నో' అని చెప్పడం కష్టమయ్యే పరిస్థితుల్లో మనమందరం ప్రస్తుతం జీవిస్తున్నాము. మీ వ్యక్తిగత జీవితాన్ని మరొక వ్యక్తి సులభంగా పరిశీలించగలడని మీరు తరచూ ఆందోళన చెందుతూ ఉండవచ్చు.

Samsung Sets The Ultimate Smartphone Privacy Benchmark With Latest Innovations On Galaxy A51 & A71

"మేక్ ఫర్ ఇండియా" చొరవతో quick switch మరియు Intelligent Content suggestions యొక్క ప్రైవసీ ఫీచర్ల మొదటి ఆవిష్కరణతో ప్రస్తుతం Samsung ముందుకు వచ్చింది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఇతరులతో పంచుకునేటప్పుడు ముఖ్యంగా GenZ ఎదుర్కొనే ఆందోళనను ఇది తొలగిస్తుంది. తద్వారా వారిని Alt Z Lifeగా జీవించడానికి అనుమతిస్తుంది.

ఇది మీ యొక్క స్వంత స్థలంలో ఏవైనా పనులను చేయడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్న జీవితం లాంటిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మీ ప్రైవేట్ క్షణాలను ప్రైవేట్‌గా ఉంచే జీవితం.

Samsung యొక్క Quick Switch ప్రైవసీ ఫీచర్

Samsung యొక్క ఈ వినూత్న ఫీచర్ Alt-Z Lifeను మీరు గడపడానికి అవసరమైన సౌలభ్యం, సేమ్ లెస్ నెస్ మరియు విచక్షణ వంటి వాటిని అందిస్తుంది. quick switch ఫీచర్ ప్రైవేట్ గ్యాలరీ నుండి ప్రధాన గ్యాలరీకి తక్షణమే మారడమే కాకుండా సైడ్ కీని Double Click చేయడం ద్వారా యాప్ లు మరియు బ్రౌజర్‌లను కూడా సులభంగా ఎవరూ గమనించకుండా మార్చవచ్చు.

ఈ యాప్ ల యొక్క ప్రైవేట్ వెర్షన్లు Galaxy A51 & గెలాక్సీ Galaxy A71 స్మార్ట్‌ఫోన్‌ల సురక్షిత ఫోల్డర్‌లో Samsung Knox చేత భద్రపరచబడి ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎటువంటి సంకోచం లేకుండా ఎవరికైనా అప్పగించవచ్చు.

Content Suggestions ఫీచర్ తో మీ గోప్యతను తెలివిగా మేనేజ్ చేయడం

Content Suggestions అనేది ఫోన్ లో పూర్తి గోప్యతను నిర్ధారించే పరిశ్రమ యొక్క మొదటి AI ఫీచర్. మీరు నిర్ణయించిన ఐడెంటిఫైయర్‌ల ఆధారంగా మీ ప్రైవేట్ ఫోటోలను సురక్షిత ఫోల్డర్‌లోని మెయిన్ గ్యాలరీ నుండి ప్రైవేట్ గ్యాలరీకి తరలించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు మీ ప్రైవేట్ గ్యాలరీలో ఉంచాలనుకునే వ్యక్తులు మరియు పేస్ లను మేనేజ్ చేయడం. ఇది ఫోటోలను ప్రైవేట్ గ్యాలరీకి తరలించాలని తెలివిగా సూచిస్తుంది.

వినియోగదారుల యొక్క తమ వ్యక్తిగత పరికరాలు ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లలోని ముఖ్యమైన మరియు ప్రైవేట్ డేటా కోసం బలమైన గోప్యతను నిర్ధారించడానికి Samsung బ్రాండ్ అవసరమైన చర్యలు తీసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము.

ఈ ఆలోచనాత్మక ఫీచర్ లను మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు తీసుకువచ్చే ఏకైక బ్రాండ్ Samsung కావడం గమనార్హం. భారతదేశంలో ప్రస్తుతం ఈ ఫీచర్ GenZ కు ప్రాధాన్యతనిస్తుంది. Quick Switch మరియు Content Suggestions ఫీచర్లు వినియోగదారుల ప్రైవేట్ డేటాకు అన్ని రకాల 360-డిగ్రీల గోప్యతను అందిస్తాయి.

అదనపు భద్రత కోసం Samsung Knox

మొబైల్ యొక్క డేటా భద్రతా టూల్లను ప్రభావితం చేస్తూ Samsung అన్ని కారణాల మీద కవర్ చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు మల్టీ-లేయర్డ్ డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫాం- Knox ద్వారా రక్షించబడి ఉండడం వలన ఫోన్ ఎప్పుడైనా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వచ్చినప్పటికీ కూడా మీ యొక్క పర్సనల్ డేటా సురక్షితంగా ఉంటుంది. Samsung ఫోన్ హార్డ్‌వేర్ చిప్‌లో నిర్మించబడిన Samsung Knox అనేది మిలిటరీ-గ్రేడ్ గోప్యతా వ్యవస్థను కలిగి ఉండి మీ యొక్క పర్సనల్ డేటాను వేరుచేస్తుంది మరియు భద్రపరుస్తుంది. ఇందులో రహస్య ఫైల్‌లు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, వీడియోలు మరియు మీ ఆరోగ్య సంబంధిత డేటా వివరాలు కూడా ఉన్నాయి.

మీ యొక్క ప్రైవేట్ డేటా కోసం ఇంత లోతైన ఆన్-సిస్టమ్ భద్రతను అందించే మరొక ఇతర బ్రాండ్ లేకపోవడం గమనార్హం.

మిడ్-రేంజ్ విభాగంలో కొత్త బెంచ్ మార్క్- Samsung Galaxy A71 & Galaxy A51

Samsung Galaxy A71 & Galaxy A51 రెండు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అదనపు ఫీచర్లతో లోడ్ చేయబడనున్నాయి. Samsung యొక్క ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు sAMOLED డిస్‌ప్లే, క్వాడ్-కెమెరా మాడ్యూల్, క్లాస్ ప్రాసెసర్‌ వంటి ప్రీమియం ఫీచర్లలో ఉత్తమమైనవి. అలాగే ఇవి ఇటీవల సింగిల్ టేక్, నైట్ హైపర్‌లాప్స్ మరియు కొత్త కెమెరా వంటి మరెన్నో ఫీచర్‌లతో అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పుడు Quick Switch మరియు Content Suggestions వంటి వినూత్న గోప్యతా లక్షణాలను చేర్చడంతో Galaxy A71 మరియు Galaxy A51 నిస్సందేహంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త బెంచ్‌మార్క్‌లుగా అగ్రస్థానంలో నిలవనున్నాయి.

మీరు Alt-Z Lifeను గడపడానికి ఇష్టపడితే కనుక మీకు Galaxy A51 & Galaxy A71 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు అనువైనవిగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఇటీవల ధరల తగ్గింపును కూడా పొందాయి. వీటిని ప్రస్తుతం సరసమైన EMI ఎంపికలతో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Galaxy A71 మరియు Galaxy A51 స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు మీరు కొనుగోలు చేయవచ్చు!

*sAMOLED ప్లస్ డిస్ప్లే Galaxy A71 లో మాత్రమే లభిస్తుంది. Galaxy A51 స్మార్ట్‌ఫోన్‌లో sAMOLED డిస్‌ప్లే ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Sets The Ultimate Smartphone Privacy Benchmark With Latest Innovations On Galaxy A51 & A71
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X