Samsung కీలక నిర్ణయం.. M, F సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధర తగ్గింపు.. లిస్ట్!
శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ M14, M04, F14, F04 స్మార్ట్‌ఫోన్లపై (Samsung smartphones price cut) డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ +128GB స్టోరేజీ ధర రూ.13,490 ఉండగా ప్రస్తుతం రూ.12490 గా ఉంది. అదే విధంగా 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ రూ.14,990 ఉండగా ప్రస్తుతం రూ.13,990గా ఉంది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీతో రానుంది. 6.6 అంగుళాల LCD పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F14 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14,490 ఉండగా.. ప్రస్తుతం రూ.11990గా ఉంది. అదే 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ రూ.15,990 ఉండగా.. ప్రస్తుతం రూ.13490గా ఉంది. 6.6 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50MP+2MP కెమెరాలు, ముందువైపు 13MP కెమెరాలున్నాయి. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8499గా ఉండగా తగ్గింపు కారణంగా ప్రస్తుతం రూ.7999గా ఉంది. అదే శాంసంగ్ గెలాక్సీ F04 స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం రూ.7999గా ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్లు 4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత ఆకర్షణీయమైన తగ్గింపును పొందవచ్చు.

ఫెస్టివల్ సీజర్ సందర్భంగా అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ప్రత్యేక సేల్‌లను నిర్వహిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 (Amazon Great Republic Day Sale 2024) జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. . స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లను వెల్లడించింది.
జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ ఈ సేల్ ప్రారంభం అవుతుంది. అదే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందు నుంచే ఈ సేల్ ఆఫర్ల యాక్సెస్ లభించనుంది. దీంతోపాటు ప్రైమ్ సభ్యులకు ఉచితంగా ఒక్కరోజు మరియు రెండు రోజుల డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ మ్యూజిక్ మరియు వీడియో స్టీమింగ్ సేవలకు యాక్సెస్ కూడా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ కూడా జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ (Flipkart Republic Day Sale 2024 )పేరుతో సేల్ నిర్వహిస్తోంది. 19 వరకు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 13 నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. టీవీలు, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. అదే గ్యాడ్జెట్లపై 85 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








