ఇండియన్ మార్కెట్‌లోకి స్మార్ట్‌ టీవీలను విడుదల చేసిన శామ్‌సంగ్‌

Posted By: Super

ఇండియన్ మార్కెట్‌లోకి స్మార్ట్‌ టీవీలను విడుదల చేసిన శామ్‌సంగ్‌

డిజిటల్‌ టెక్నా లజీలో అగ్రగామి అయిన శామ్‌సంగ్‌ ఇండియా తన నూతన స్మార్ట్‌టివీ మోడల్స్‌ను ప్రకటించింది. ఎల్‌ఇడి, ప్లాస్మాల విభాగంలో వీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.ఈ కొత్త స్మార్ట్‌ టివిలు మరింతగా కస్టమర్‌లకు మరింత అత్యాధునిక సేవలు అందిస్తాయని సంస్థ ప్రతినిథులు తెలిపారు. సినిమాల అన్వేషణను ,టివి షోస్‌ను తెలుసుకోవడానికి, వెబ్‌బ్రౌజింగ్‌ వంటివి సులభంగా చేసుకునేందుకు ఈ స్మార్ట్‌ టివిలు వీక్షకులకు ఉపకరిస్తాయన్నారు. వీక్షకులకు ఇవి మరింత సన్నిహితంగా ఉండి చక్కని వీక్షణానుభవాన్ని అందిస్తాయన్నారు.

ఎల్‌ఇడి టివిలు, 3డి టివిలను ప్రప్రథమంగా విడుదల చేసిన కంపెనీగా స్మార్ట్‌ టివిలను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడంలోనూ మేం ముందున్నాం. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ కుటుంబానికి వినోదాన్ని అందించే దిశగా స్మార్ట్‌ టివిలు మా భారతీయ వినియోగదారులకు వైవిధ్యమైన అనుభవాన్ని అందిస్తాయి. దీనికోసం మేం టైమ్స్‌ మ్యూజిక్‌, ఎన్‌డిటివి వంటి కంటెంట్‌ డెవలపర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం అని తెలిపారు.

ఈ టివీల ద్వారా మనం లైవ్ టివిని కూడా చూసుకునే అవకాశం ఉంది. మీ టేస్ట్‌కి తగ్గట్లు మీకు కావాల్సినటువంటి లేటేస్ట్ వీడియోస్‌ని వీడియో సెర్చ్ ఇంజన్ ద్వారా మీరు పోందగలుగుతారు.

మీకు కావాల్సినన్నీ అప్లికేషన్స్ శామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీ అందించడం జరుగుతుంది. వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఉదాహారణకు నెట్ ఫిక్స్, బ్లాక్ బుస్టర్స్, యూట్యూబ్, హులు ప్లస్ లాంటివి అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఈ టీవిలలో మీరు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్ బుక్ లేటేస్ట్ అప్ డేట్స్ కూడా పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot