రిమోట్ లేకుండా టీవి కంట్రోల్ చేయాలంటే..!

Posted By: Super

రిమోట్ లేకుండా టీవి కంట్రోల్ చేయాలంటే..!

 

స్మార్ట్ ఫోన్స్‌లలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న శాంసంగ్ ఇండియాలో శాంసంగ్ స్మార్ట్ టివి సిరిస్‌లను ప్రవేశపెట్టనుంది. శాంసంగ్ స్మార్ట్ టివిలలో ఉన్న అమేజింగ్ ఫీచర్ ఏమిటంటే గాల్లోనే మీ చేతులు ద్వారా టీవిని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదండోయ్ మీ వాయిస్‌ని ఉపయోగించి కూడా టీవిని కంట్రోల్ చేయవచ్చు. రిమోట్‌ని ఉపయోగించకుండా మీ టివిని కంట్రోల్ చేయవచ్చు.

రిమోట్ లేకుండా టీవి కంట్రోల్ చేయాలంటే..!

ఇంకా మీకు షాక్ అనిపించే విషయం ఏమిటంటే టీవి రిమోట్‌ని, టివిని టచ్ చేయకుండా.. టీవిని ఆన్/ఆఫ్ లేదా ఛానెల్స్ మార్పు లాంటివి చేయవచ్చు. ఈ స్మార్ట్ టివీల ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవడంతో పాటు వివిధ రకాల అప్లికేషన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ టివిలో ఉన్న మెకానిజాన్ని 'స్మార్ట్ ఇంట్రాక్షన్' అని, ఈ టెలివిజన్‌ని రూపొందించడంలో ఉపయోగించిన టెక్నిక్స్‌ని 'స్మార్ట్ టెలివిజన్స్' అని పిలుస్తున్నారు.  'స్మార్ట్ ఇంట్రాక్షన్' మెకానిజాన్ని శాంసంగ్ LED ES8000, LED ES7500 సిరిస్‌లతో పాటు Plasma E8000 సిరిస్‌లలో నిక్షిప్తం చేశారు.

వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్ టీవిల ధరలు ఇండియాలో రూ 45,000 నుండి రూ 2.50 లక్షల వరకు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot