శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా, అమెజాన్ ఆఫర్లపై ఓ లుక్కేయండి
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లకు తెరలేపబోతోంది. రానున్న ఫెస్టివల్ సీజన్ ని పురస్కరించుకుని బంపరాఫర్లను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పేరుతో కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ వివరాలను సేల్ కు ముందే బహిర్గతం చేసింది.

దాదాపు 40 శాతం వరకు శాంసంగ్ ఫోన్ల మీద తగ్గింపును కంపెనీ అందించింది. ఇంకా అదనంగా 10 శాతం కార్డుల ద్వారా డిస్కౌంట్లను అందిస్తోంది. కాగా ఈ సేల్ సెప్టెంబర్ 29 నుండి మొదలై అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో తగ్గింపు పొందిన స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం పదండి.

శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్
ఈ ఫోన్ 4జిబి ర్యామ్/128 రోమ్ ధర రూ. 22,999గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి పాత ఫోన్ల మీద రూ. 2500 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్ లో ట్రిపుల్ రేర్ కెమెరా సెట్ అప్ తో పాటు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ఆకర్షణగా ఉంది. కాగా ఈ ఫోన్ స్టార్టింగ్ ధర రూ. 16,999 నుంచి మొదలవుతుంది. 4జిబి ర్యామ్ అలాగే 64 జిబి రోమ్ ధర ఇది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి పాత ఫోన్ల మీద రూ. 2500 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది. 5 శాతం క్యాష్ బ్యాక్‌ను హెచ్‌డిఎఫ్‌సి కార్డు ద్వారా పొందవచ్చు.

Samsung Galaxy Note 9 At Rs. 42,999
ఈ ఫోన్ అమెజాన్ లో రూ.42,999 ధర వద్ద ట్యాగ్ అవుతోంది. 6.4 ఇంచ్ పుల్ హెచ్ డి అమోల్డ్ డిస్ ప్లే ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫోన్ నిలుస్తోంది. దీని మీద కూడా కంపెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది.

Samsung Galaxy Note 10 At Rs. 69,999
ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ధర రూ. 69,999గా ఉంది. 8జిబి ర్యామ్ , 256 జిబి ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర ఇది. అరోరా బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి పాత ఫోన్ల మీద రూ. 6000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది.

Samsung Galaxy A10s At Rs. 9,490
2GB RAM and 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 9,490గా ఉంది. HSBC cashback card ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి no-cost EMI option ఉంది.

Samsung Galaxy A70 At Rs. 28,990
ఈ ఫోన్ 6GB RAM and 128GB ROM variant ధర రూ. 28,990గా ఉంది. బ్లూ కలర్ ఆప్సన్ అందుబాటులో ఉంది. 32MP + 8MP + 5MP rear camera setup అదనపు ఆకర్షణగా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి పాత ఫోన్ల మీద రూ. 3000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది.

Samsung Galaxy S10 At Rs. 61,900
ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ. 61,900గా ఉంది. 8GB RAM/128GB ROM వేరియంట్ ధర ఇది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న వారికి పాత ఫోన్ల మీద రూ. 9000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం ఉంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Samsung Galaxy A50 At Rs. 18,490
4GB RAM and 64GB ROM వేరియంట్ ధర రూ. 18,490, పాత ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ.1000 తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటుగా Samsung Galaxy A20 ఫోన్ ధర రూ. 11,490గా ఉంది. ఈ ఫోన్ 3జిబి ర్యామ్ 32 జిమి రోమ్ ధర రూ.11,490గాఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ప్లస్ కూడా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 73,900గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు ద్వారా రూ. 4,999తో జియో రీఛార్జ్ చేసుకుంటే 1.4 టిబి డేటాను పొందవచ్చు. రూ. 9000 వరకు ఎక్స్జైంజ్ సౌకర్యం కూడా ఉంది. మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎ80 ధర ఈ సేల్ లో రూ. 47,990గా ఉంది. దీనికి ఈఎమ్ఐ సదుపాయం కూడా ఉంది.


Click it and Unblock the Notifications