ఒకరిపై మరొకరు.. జోరందుకుంటున్న అస్త్రాలు!

Posted By: Prashanth

ఒకరిపై మరొకరు.. జోరందుకుంటున్న అస్త్రాలు!

 

ప్రపంచపు స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ మల్టీపుల్ కాంభినేషన్ (బహుళ కలయిక)తో కూడిన ఓ స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించింది. గెలక్సీ నోట్‌కు ఈ డ్యూయల్ రోల్ గ్యాడ్జెట్ కొనసాగింపుగా వస్తుంది. 5.3 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో విడుదలైన గెలక్సీ నోట్ అప్పట్లో వినియోగదారుడి అంచనాలకు రెట్టింపు భరోసానిచ్చింది. తాజాగా రూపుదిద్దుకుంటన్న డివైజ్ పేరు గెలక్సీ నోట్ 2 క్వాడ్. దీని డిస్‌ప్లే విస్తీర్ణం 6.7 అంగుళాలు.

తాము వృద్ధి చేస్తున్న గెలక్సీ క్వాడ్ 2, ఆపిల్ ఐఫోన్‌కు రెండితులు రెట్టింపు పరిమాణాన్ని కలిగి ఉంటుందని కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర ఫీచర్లను గోప్యంగా ఉంచారు. పెద్ద స్ర్కీన్ సైజ్ కలిగిన ఫోన్ల ద్వారా కలిగి లాభాలను వినియోగదారులకు వివరించేందుకు శామ్‌సంగ్ ఓ ప్రచారకర్యాక్రమాన్ని నిర్వహించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot