మెగా ఫ్యామిలీ టాప్ సీక్రెట్?

Posted By: Prashanth

Samsung to launch a Social Network in 2013?

 

మెగాఫ్యామిలీగా పిలవబడే సామ్‌సంగ్, ఫేస్‌బుక్ తరహాలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను 2013నాటికి అందుబాటులోకి తేనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. సామ్‌సంగ్ రూపొందిస్తున్న సామాజిక వెబ్‌సైట్, ప్రపంచ నెం.1 ఫేస్‌బుక్‌తో పోటీ పడేదిగా ఉంటుందని కొరియన్ టైమ్స్ పేర్కొంది. 2013 ప్రధమ క్వార్టర్ నాటికి ఈ వ్యవస్థ ఆచరణలోకి రానుంది. బ్రాండ్ వృద్ధి చేస్తున్న గ్యాడ్జెట్‌లతో పాటు ఇంటర్నెట్‌కు స్పందించే అన్ని సాంకేతిక పరికరాలను ఈ వెబ్‌సైట్ సపోర్ట్ చేస్తుంది.

మళ్లి తెర పైకి!

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై అట్టహాసంగా ప్రదర్శంపబడిన ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1’ టాబ్లెట్ , ఆ తరువాత కనుమరుగైంది. కారణాలు తెలియనప్పటికి, గెలాక్నీ నోట్ 10.1 ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. సామ్‌సంగ్ అభిమానులు ఈ డివైజ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను మరిచిపోతున్న సందర్భంలో నెట్‌లో ప్రత్యక్షమైన ఓ వీడియో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసిన గెలాక్సీ నోట్ 10.1 టాబ్లెట్‌ను సామ్‌సంగ్ బృందం వీడియో రూపంలో నెట్‌లో పొందుపరిచింది.

అప్‌డేటెడ్ వర్షన్ గెలాక్నీ నోట్ 10.1 టాబ్లెట్ పీసీలో గెలాక్సీ ఎస్3 తరహాలో క్వాడ్‌కోర్ చిప్‌ను అమర్చారు. కంప్యూటింగ్‌‌ను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ‘ఎస్ పెన్ స్టైలస్’ను టాబ్లెట్‌లో సమకూర్చారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌‌విచ్ ప్లాట్‌ఫామ్ పై డివైజ్ రన్ అవుతుంది. పెబ్బిల్ బ్లూ కలర్ వేరియంట్‌లో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీ ధర ఇతర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అప్‌గ్రేడెడ్ వర్షన్ ‘గెలాక్సీ నోట్ 10.1’ టాబ్లెట్ పీసీకి సంబంధించి వెబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోను కింద చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot