వెలుగులోకి మరో కోణం..?

ఆపిల్‌ను అధిగమించే క్రమంలో శామ్‌సంగ్ మరిన్ని అస్త్రాలను సిద్దం చేసినట్లు బయటకు పొక్కిన ఓ అంతర్గత డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. రెటీనా డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీగా
ఎస్‌ప్రెస్సో7, ఎస్‌ప్రెస్సో 10 వేరియంట్‌లలో రెండు టాబ్లెట్ కంప్యూటర్లను బరిలోకి దింపేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. వీటి విడుదల జూన్‌లో ఉండే అవకాశముంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజులను శామ్‌సంగ్ టెలివిజన్ సెట్లకు అనుసంధానించుకునే అవకాశం ఉంటుంది.
కొత్త ఐప్యాడ్‌కు ఓ సవాల్‌గా నిలిచే విధంగా ఈ టాబ్లెట్‌లలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, క్వాడ్‌కోర్ Exynos ప్రాసెసర్ అదేవిధంగా హై పిక్సల్‌తో కూడిన హైడెఫినిషన్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఈ గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమచారం లేదు. ఆధునిక హంగులతో విడుదలకు ముస్తాబవుతున్న ఎస్‌ప్రెస్సో 10, ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు గొప్ప పోటీ ఇవ్వగలదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇండస్ట్రీలో షికారు చేస్తున్న ఈ రూమర్ పై శామ్‌సంగ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
తగ్గింపు ధరతో గెలక్సీ స్మార్ట్‌ఫోన్:
యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌లలో అత్యుత్తమైనదైన శామ్‌సంగ్ గెలక్సీ పాప్ S5570ను తగ్గింపు ధరతో సొంతం చేసుకునే సదవకాశాన్ని మిస్ కాకండి. రూ.9750 విలువ చేసే ఈ డివైజ్‌ను saholic.com వారు రూ.7979కే అందిస్తున్నారు. ఈ కోనుగోలు పై వినియోగదారు రూ.1771 రాయితీని పొందవచ్చు.
గెలక్సీ పాప్ S5570 ప్రధాన ఫీచర్లు:
3.14’’ టచ్‌స్ర్కీన్, టచ్‌విజ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్(ఉత్తమమైన నావిగేషన్ కోసం), 3జీ, వై-ఫై, క్వర్టీ కీబోర్డ్, 3 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా, క్విక్ ఫైర్ డాక్యుమెంట్ వ్యూవర్, 160ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, ఎక్సటర్నల్ మెమరీ కార్డుల ద్వారా జీబిని 32కు పెంచుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ బ్రౌజర్, వివిధ జావా గేమ్‌లను సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications