గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
ఫిబ్రవరి 1, 2023న, శాంసంగ్ గెలాక్సీ Unpacked ఈవెంట్‌లో, కంపెనీ ఎట్టకేలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గెలాక్సీ S23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో శాంసంగ్ గెలాక్సీ S23, S23+ మరియు S23 అల్ట్రాలను లాంచ్ చేసింది.కొరియన్ స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ స్థానిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి భారతదేశంలోనే ఈ ప్రీమియం గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది.

గెలాక్సీ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలోనే తయారీ
ప్రస్తుతం, గెలాక్సీ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్ యొక్క వియత్నాం ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి మరియు కంపెనీ వాటిని భారతదేశంలో విక్రయించడానికి దిగుమతి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ప్రకారం "భారతదేశంలో విక్రయించే అన్ని గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడతాయి. శాంసంగ్ ఇప్పటికే భారతదేశంలో డిమాండ్ కు సరిపోయే లాగా ఎక్కువ ఫోన్లను నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. 'మేడ్ ఇన్ ఇండియా' గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో సేల్ చేయాలనీ శాంసంగ్ నిర్ణయం తీసుకుంది. " అని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.

గెలాక్సీ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ప్రత్యేకమైన విక్రయ ప్రతిపాదనలలో ఒకటైన కెమెరా లెన్స్‌ల దిగుమతిపై సుంకాన్ని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ లో ప్రకటించడం కూడా జరిగింది.
గెలాక్సీ S23 అల్ట్రా కొత్త 200MP కెమెరా తో వస్తుంది
"గెలాక్సీ S23 అల్ట్రా శాంసంగ్ యొక్క అత్యంత అధునాతన కెమెరా సిస్టమ్‌తో వస్తుంది, దాదాపు ఎలాంటి లైటింగ్ పరిస్థితులకైనా అనుగుణంగా మరియు అద్భుతమైన వివరాలను అందించడానికి ఇది రూపొందించబడింది. గెలాక్సీ S23 అల్ట్రా కొత్త 200MP అడాప్టివ్ పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది" అని ప్రకటన తెలిపింది.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా సిరీస్‌లోని ప్రధాన కెమెరా సెన్సార్ సామర్థ్యాన్ని గెలాక్సీ S22 అల్ట్రాతో పోలిస్తే 200 మెగాపిక్సెల్‌లకు రెట్టింపు చేసింది, అదే సమయంలో 10 రెట్లు స్పేస్ జూమ్‌తో పాటు 10 రెట్లు ఆప్టికల్ మరియు డిజిటల్ జూమ్ ఫీచర్లను కలిగి ఉంది.12 మెగాపిక్సెల్స్ నుండి 200 మెగాపిక్సెల్స్ పరిధిలో కెమెరా సెన్సార్లతో ఐదు కెమెరాలతో ఫోన్ రానుంది. Galaxy S22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే Samsung Galaxy S23 సిరీస్ ధర 27-30 శాతం ఎక్కువ.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ S23 ధరల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S23 ధర : శాంసంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 74,999. ధరవద్ద లాంచ్ అయింది. అదేవిధంగా, ఈ ఫోన్ యొక్క 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, లావెండర్ మరియు క్రీమ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ ధర: శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 94,999 గా ఉంది. అదేవిధంగా, ఈ ఫోన్ యొక్క 8GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్ మరియు క్రీమ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర: శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,24,999 గా ఉంది. అదేవిధంగా, ఈ ఫోన్ యొక్క 12GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,999 గా ఉంది. ఇక చివరగా 12GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,54,999 గా ఉంది . ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్రీన్ మరియు క్రీమ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అధికారిక Samsung వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications