శాంసంగ్, ఇంటెల్‌ కలయిక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం

Posted By: Prashanth

శాంసంగ్, ఇంటెల్‌ కలయిక.. కొత్త అధ్యాయానికి శ్రీకారం

 

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో మంగళవారం తన సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ 'బడా'ని ఛిప్ మేకర్ ఇంటెల్ కార్పోరేషన్‌ ఆపరేటింగ్ సిస్టమ్ టైజన్‌ని విలీనం చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇలా చేయడం వల్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ అపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్‌కి సపోర్ట్ నిస్తుందని వారి అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. గతయేడాది స్మార్ట్ ఫోన్స్‌లలో శాంసంగ్ రికార్డు స్దాయి అమ్మకాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత శాంసంగ్ ఒక్కసారిగా తన అమ్మకాలను పెంచుకుంది. ఐతే ఇంటెల్ కూడా ఈ డీల్‌కి అంగీకరించి 'టైజన్' సాప్ట్‌వేర్‌ని రూపొందించనున్నారు. సెల్ ఫోన్స్‌తో పాటు వేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు తాము రూపొందిస్తున్న లైమో, మీగో ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో సక్సెస్ సాధించాలంటే వినియోగదారుల సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలని శాంసంగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

గత వారం ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో శాంసంగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ టై-జిన్ మాట్లాడుతూ బడా - టైజిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను విలీనం చేయనున్నామన్నారు. ఇక టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఓపెన్ సోర్స్ అయినప్పటికీ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ఇంటర్నెట్ టీవిలు, నోట్ బుక్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది. గతయేడాది మూడవ త్రైమాసికంలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్ ప్రపంచ వ్యాప్తంగా 53 శాతం మార్కెట్‌ని ఆక్రమించుకోగా, శాంసంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్ 2.2 శాతం మార్కెట్‌ని ఆక్రమించాయి.

ఇది ఇలా ఉంటే 2011వ సంవత్సరానికి గాను నాల్గవ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ తయారీదారు నష్టాలను చవిచూస్తే, అదే స్మార్ట్ ఫోన్స్ విభాగంలో మరో తయారీదారైన సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ గెయింట్ శాంసంగ్ మాత్రం రికార్డు స్దాయి లాభాలను చవి చూసింది. ఇక వివరాల్లోకి వెళితే 2011వ సంవత్సరానికి గాను 35 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు జరిపి $4.5 బిలియన్లను ఆర్జించింది.

శాంసంగ్ మూడవ త్తైమాసికంలో 28 మిలియన్ల అమ్మకాలు చేయగా, నాల్గవ త్రైమాసికంలో 35 మిలియన్లు అంటే దాదాపు 7 మిలియన్ల అమ్మకాలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. మూడవ త్రైమాసికంలో 22శాతం లాభాలను ఆర్జించగా, నాల్గవ త్రైమాసికం(అక్టోబర్ - డిసెంబర్)లో 73శాతం లాభాలను ఆర్జించింది. శాంసంగ్ అమ్మిన అమ్మకాలు హెచ్‌టిసి ఉత్పత్తులకు మూడింతలు వర్తించనున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot