కోర్టుకెక్కిన కస్టమర్.. ఫైన్ కట్టిన సామ్‌సంగ్!

Posted By: Super

 కోర్టుకెక్కిన కస్టమర్.. ఫైన్ కట్టిన సామ్‌సంగ్!

 

దోషపూరితమైన ఫోన్‌ను డెలివర్ చేయటమే కాకుండా దాన్ని రిపేర్ చేయటంలోనూ విఫలమవటంతో సామ్‌సంగ్ ఇండియాకు కన్స్యూమర్ ఫారమ్ రూ.10,000 జరిమానాను విధించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ముల్క్ రాజ్ మాన్‌చందా, 2009లో  రూ.5,300 పెట్టి సామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సదరు ఫోన్‌ను విక్రయించిన డీలర్ కొనుగోలు పై 5 సంవత్సరాల ఉచిత సర్వీస్ వారంటీని కల్పించాడు. మొదటి రోజు నుంచే ఫోన్ పనితీరు ఆశాజనకంగా లేకపోవటంతో చందా డీలర్‌ను సంప్రదించారు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవటంతో విసుగుచెందిన ఆయన సెంట్రల్ ఢిల్లీ కన్స్యూమర్ డిస్స్యూట్స్ రిడ్రెస్సల్ ఫారమ్‌ను ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదలను పరిశీలించిన బెంచ్ సదరు ఫోన్‌ కంపెనీని తప్పుబడుతూ తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఫోన్ ఖరీదు, ఇతర న్యాయపరమైన ఖర్చులు క్రింద వినియోగదారుకు రూ.10,000 చెల్లించాలని సూచించింది.

గతంలో నోకియా ఇండియాకు ఇదే పరిస్ధితి!

నోకియా ఇండియా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొవల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీకి చెందిన రోహన్ అరోరా జూలై 2007లో నోకియా ఈ కమ్యూనికేటర్‌ను రూ.37,000లు వెచ్చించి నోకియా రిటైలర్ అయిన లూత్రా కమ్యూనికేషన్స్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఆ ఫోన్‌లో సాంకేతికపరమైన సమస్యలు తెలెత్తటంతో సెప్టంబర్ 2007 సెప్టంబర్‌లో మరమ్మతు నిమిత్తం సంబంధిత సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే అరోరా ఫోన్ కొనుగోలు చేసిన లుత్రా కమ్యూనికేషన్స్ అదేవిధంగా నోకియా ఇండియాల నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. ఫోన్ కూడా తిరిగి ఇవ్వలేదు. దింతో విస్తు చెందిన సదురు వినియోగదారుల సౌత్-2 డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బెంచ్ వాదోపవాదనలు పరిశీలించిన అనంతరం సదరు సంస్థ పనితీరును ఎండగడుతూ వినియోగదారుకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. తాజా తీర్పులో భాగంగా నోకియా ఇండియా రోహన్ అరోరా కు ఫోన్ ధర రూ.37,000తో పాటు, నాసిరకం ఉత్పత్తిని విక్రయించినందుకుగాను రూ.25,000, ఇతర ప్రొసీడింగ్స్ కింద రూ.5,000లు చెల్లించాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot