SmartPhone మెమోరీ చిప్ త‌యారీ మార్కెట్లో Samsung దే అగ్ర‌స్థానం!

|

గ్లోబ‌ల్ SmartPhone మెమోరీ చిప్‌ల‌ త‌యారీ మార్కెట్లో ద‌క్షిణ కొరియాకు చెందిన Samsung కంపెనీ స‌త్తా చాటింది. మెమోరీ చిప్ త‌యారీ మార్కెట్లో అత్య‌ధికంగా 46 శాతం వాటాను క‌లిగి ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు స్ట్రాట‌జీ అన‌లిటిక్స్ నివేదిక‌లు వెల్ల‌డించాయి. Samsung తో పాటు మ‌రో ద‌క్షిణ కొరియా కంపెనీ ఎస్‌కే హైనిక్స్ హోల్డ్ రెండు కంపెనీలు క‌లిపి గ్లోబ‌ల్ మెమోరీ చిప్‌ల త‌యారీలో 70 శాతం మార్కెట్ వాటా క‌లిగి ఉన్నట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ పేర్కొంది.

Samsung Memory Chip

ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ DRAM (dynamic random access memory) మరియు NAND ఫ్లాష్ మార్కెట్ల‌లో విక్రయాలు $11.5 బిలియన్లు (దాదాపు రూ. 91,300 కోట్లు)గా అంచనా వేయబడ్డాయి. అయితే రెండు మార్కెట్ల‌లో Samsung ఎలక్ట్రానిక్స్ కంపెనీ 46 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండ‌గా, 24 శాతం వాటాతో ఎస్‌కే హైనిక్స్ కంపెనీ రెండో స్థానంలో ఉన్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

స్మార్ట్‌ఫోన్ DRAM మార్కెట్లో, NAND ఫ్లాష్ మార్కెట్‌లో రెండింటిలో అత్య‌ధిక వాటాతో Samsung అగ్ర‌స్థానంలో ఉన్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది. సామ్‌సంగ్ కంపెనీ వాటాలు వ‌రుస‌గా.. DRAM మార్కెట్లో 52 శాతంగా మరియు NAND ఫ్లాష్ మార్కెట్‌లో 39 శాతంగా న‌మోదైన‌ట్లు తెలిపింది. ఎస్‌కే హైనిక్స్ కంపెనీ వాటాలు వ‌రుస‌గా.. DRAM మార్కెట్‌లో 25 శాతం మరియు NAND ఫ్లాష్ మార్కెట్‌లో 23 శాతంగా ఉన్న‌ట్లు నివేదిక తెలిపింది. రెండు కంపెనీల మొత్తం వాటా 70 శాతంగా ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు DRAM మార్కెట్‌లో 76 శాతం మార్కెట్ వాటాను మరియు NAND ఫ్లాష్ మార్కెట్‌లో 62 శాతం వాటాను కలిగి ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, గత సంవత్సరం విశ్లేషణతో పోలిస్తే ఈ కంపెనీల మార్కెట్ వాటాలు (గ‌తేడాది Samsung 49 శాతం మరియు SK 23 శాతం) కొంత మేర త‌గ్గిన‌ట్లు నివేదించాయి.

Samsung Memory Chip

ఇక US కు చెందిన సంస్థ మైక్రోన్ 15 శాతం వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ అగ్రశ్రేణి ముగ్గురు సరఫరాదారుల ఉమ్మడి వాటా 85 శాతానికి చేరుకుంది. స్ట్రాటజీ అనలిటిక్స్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఎంట్విస్ట్లే మాట్లాడుతూ, "5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి చెందుతున్నప్పటికీ, డిమాండ్ మ‌రియు స్థూల మార్కెట్ అనిశ్చితి కారణంగా స్మార్ట్‌ఫోన్ మెమోరీ చిప్‌ మార్కెట్ ప్రభావితమవుతుంది." అని తెలిపారు.

Samsung Memory Chip

ఇదిలా ఉండ‌గా.. సామ్‌సంగ్‌కు చెందిన Samsung Galaxy S22 Ultra చాలా ఎక్కువ ధ‌ర క‌లిగిన‌ప్ప‌టికీ గ‌త ఏప్రిల్ నెల‌లో మంచి అమ్మ‌కాల‌ను న‌మోదు చేసింది. ఏప్రిల్ నెల‌లో గ్లోబ‌ల్ అత్య‌ధిక‌ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల జాబితాలో ఈ మొబైల్స్ 1.5శాతం షేర్‌తో 5వ స్థానంలో నిలిచాయి. ఈ Samsung Galaxy S22 Ultra మొబైల్స్ ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ప్ర‌స్తుతం Samsung Galaxy S22 Ultra (ఫాంటం వైట్‌)ను రూ.1,09,999కి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Samsung Galaxy S22 Ultra ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM8450 Snapdragon 8 Gen 1 (4 nm) ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ కి 6జీబీ రామ్, 8జీబీ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌కు వెన‌క వైపు నాలుగు కెమెరాల‌ను అందిస్తున్నారు. 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 10MP+ 10MP+12MP క్వాలిటీతో మ‌రో మూడు కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 40 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 5000 mAh సామ‌ర్థ్యంతో, 45W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Tops Global Smartphone Memory Chip Market

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X