5మిలియన్ డౌన్‌లోడ్స్ దాటిపోయిన శ్యామ్‌సంగ్ టివి అప్లికేషన్స్

Posted By: Staff

5మిలియన్ డౌన్‌లోడ్స్ దాటిపోయిన శ్యామ్‌సంగ్ టివి అప్లికేషన్స్

విడుదల చేసినటువంటి ఒక్క సంవత్సరంలోనే శ్యామ్‌సంగ్ టివి అప్లికేషన్స్ రికార్డుస్దాయి డౌన్‌లోడ్స్‌ని నమోదు చేయడం జరిగింది. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం రూపోందించినటువంటి డివైజెస్ వాటి అనుసంధానం కోసం ఉపయోగించే అప్లికేషన్స్ 5మిలియన్ డౌన్‌లోడ్స్‌ని నమోదు చేయడం జరిగింది. జనవరి నెలలో శ్యామ్‌సంగ్ కంపెనీ తన యొక్క శ్యామ్‌సంగ్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్‌ని విడుదల చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద టెలివిజన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి అప్లికేషన్ స్టోర్ అవ్వడం వల్ల ప్రపంచం మొత్తం మీద 2మిలియన్ డౌన్ లోడ్స్ నమోదు అయ్యాయి.

అంతేకాకుండా స్టోర్ ప్రారంభించిన 268రోజులలో 1మిలియన్ డౌన్ లోడ్స్ నమోదుకాగా, ఆ తర్వాత 53రోజుల్లో 2మిలియన్ డౌన్ లోడ్స్ చేరుకోని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వినియోగదారులు ప్రతి ఐదు రోజులకు గనుక చూసుకుంటే యావరేజిగా 100,00 డౌన్ లోడ్స్ చేస్తున్నట్లు శ్యామ్‌సంగ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక శ్యామ్‌సంగ్ అప్లికేషన్స్ స్టోర్స్ ఇప్పటివరకు దాదాపు 120దేశాలలో అందుబాటులో ఉన్నాయి. శ్యామ్‌సంగ్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి అప్లికేషన్స్‌లలో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అక్కువెదర్, విమియో లాంటివి ముఖ్యమైనవి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot