Home
News

CES 2024 గ్లాస్‌ లాంటి డిస్‌ప్లేతో వినూత్నమైన టీవీని ఆవిష్కరించిన శాంసంగ్‌.. ఏంటీ దీని ప్రత్యేకత?

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ ఈవెంట్లలో ఒకటైన CES 2024 ( కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో 2024 ) జరుగుతోంది. జనవరి 9న ప్రారంభం అయిన ఈ షో 12వ తేదీ వరకు జరగనుంది. ఈ ఎలక్ట్రానిక్‌ షో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్‌ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. మరియు కీలక వివరాలను పంచుకుంటాయి.

శాంసంగ్‌ నుంచి విప్లవాత్మక ఆవిష్కరణ : ఈ CES 2024 వేదికగా శాంసంగ్‌ ప్రపంచంలోనే తొలిసారిగా ట్రాన్స్‌పరెంట్‌ మైక్రో LED టీవీని ( Samsung transparent micro LED TV ) ఆవిష్కరించింది. ఈ టీవీ లాంచింగ్‌తో ప్రపంచం చూపును తనవైపునకు తిప్పుకుంది. ఈ టీవీలో గ్లాస్‌ తరహా పారదర్శకమైన ప్యానల్‌ను కలిగి ఉంటుంది. డిజైన్‌, ఫీచర్ల పరంగా ఈ ట్రాన్స్‌పరెంట్ టీవీ ఆకట్టుకుంది.

CES event 2024

సెంటీమీటర్‌ స్లిమ్‌ ప్రొఫైల్‌తో భిన్నమైన అనుభూతి : శాంసంగ్‌ తొలి ట్రాన్స్‌పరెంట్‌ మైక్రో LED TV నాలుగు సైజ్‌ వేరియంట్లలో లభించనుంది. టీవీలు 76- అంగుళాలు, 89- అంగుళాలు, 101- అంగుళాలు, 114- అంగుళాల పరిమాణాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ వేరియంట్లు 1 సెంటీమీటర్‌ థిక్‌నెస్‌తో స్లిమ్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి. సంప్రదాయ డిస్‌ప్లేలను బదులుగా భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

స్వీయ ప్రకాశ శక్తిని కలిగి ఉంటుంది : ఈ మైక్రో LED టీవీ అధిక పిక్సల్‌ సాంద్రతను కలిగి ఉంది. షార్ప్‌ మరియు స్పష్టమైన విజువల్‌ అనుభూతిని కలిగిస్తుంది. ఈ శాంసంగ్‌ ట్రాన్స్‌పరెంట్‌ టీవీ స్వీయ ప్రకాశ శక్తిని కలిగి ఉంటుంది. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న LCD, OLED డిస్‌ప్లేల బ్యాక్‌లైట్‌ అవసరం లేదు. మొత్తానికి ఈ శాంసంగ్‌ కొత్త టీవీ మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది.

CES event 2024

పరిసరాల కాంతితో చాలా తక్కువ ప్రభావితం అవుతుంది : శాంసంగ్‌ ట్రాన్స్‌పరెంట్‌ మైక్రో LED టీవీ విప్లవాత్మక ఆవిష్కరణ ఒకటిగా భావించవచ్చు. అయితే డిజైన్ మాత్రం వినూత్నంగా ఉంది. సాధారణ OLED ప్యానల్‌తో పోలిస్తే శాంసంగ్ తాజా ఆవిష్కరణ అధిక ప్రకాశవంతమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మైక్రో LED టీవీ పరిసరాల కాంతి ద్వారా డిస్‌ప్లే తక్కువగా ప్రభావితం అవుతుంది.

సాధారణ వినియోగదారుడిని చేరేందుకు ఎంతో సమయం : 110 అంగుళాల శాంసంగ్‌ నాన్‌ ట్రాన్స్‌పరెంట్‌ మైక్రో LED TV ధర $1,50,000 గా ఉంది. అదే ట్రాన్స్‌పరెంట్‌ మైక్రో LED టీవీ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ట్రాన్స్‌పరెంట్‌ టీవీలు సాధారణ వినియోగదారుడికి అందుబాటులో వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung unveiled transparent micro LED TV here are features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X