సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

సామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ నాలుగు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు రూ.19,300 నుంచి రూ.25,500 మధ్య ఉన్నాయి. గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలైన ఈ ఫోన్‌లు ఏ5, ఏ3, ఇ7, ఇ5 మోడల్స్‌లో మరికొద్ది రోజుల్లో లభ్యంకానున్నాయి. వీటిలో గెలాక్సీ ఏ3, ఏ5 స్మార్ట్‌ఫోన్‌లను అత్యంత సన్నని ఆకృతితో మెటల్ యూనిబాడీతో రూపొందించినట్లు సామ్‌సంగ్ పేర్కొంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ ఏ5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280x720), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 3జీ,4జీ ఎల్టీఈ, వై-ఫై, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 123 గ్రాములు, చుట్టుకొలత 139.3 x 69.7 x 6.7మిల్లీ మీటర్లు, ధర రూ.25,500

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ3 కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ కెమెరా, 3జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 110 గ్రాములు, చుట్టుకొలత 130.1 x 65.5 x 6.9మిల్లీ మీటర్లు, ధర రూ.20,500

గెలాక్సీ ఇ7 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై, బ్లూటూత్, 2,950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 151.3 x 77.2 x 7. 3 మిల్లీ మీటర్లు, ధర రూ.23,000.

గెలాక్సీ ఇ5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ సీపీయూ, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 141.6 x 70.2 x 7.3 మిల్లీ మీటర్లు, ఫోన్ ధర రూ.19,300.

English summary
Samsung unveils Galaxy E7, E5, A5, A3 smartphones in India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot