Galaxy Ring పేరుతో స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసిన శాంసంగ్.. ఆకట్టుకొనే డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
శాంసంగ్ జనవరి 17న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను (Samsung Unpacked event 2024) నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర గ్యాడ్జెట్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో 'గెలాక్సీ రింగ్'ను శాంసంగ్ విడుదల చేసింది.
ఈ శాంసంగ్ గెలాక్సీ రింగ్ (Galaxy Ring) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. శాంసంగ్ హెల్త్ యాప్ మరియు గెలాక్సీ వాచ్ ద్వారా ఈ శాంసంగ్ స్మార్ట్ రింగ్ సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ గెలాక్సీ రింగ్‌ను వెల్‌నెస్ గ్యాడ్జెట్‌గా పరిచయం చేసింది.

అయితే ఈ గెలాక్సీ రింగ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇప్పటికే పలు సంస్థలు స్మార్ట్ రింగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బోట్, నాయిస్ సంస్థకు చెందిన లూనా రింగ్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) ఆధారంగా పనిచేస్తుందని అన్‌ప్యాక్డ్ ఈవెంట్ వేదికగా శాంసంగ్ ప్రతినిధి వెల్లడించారు. దీని ద్వారా ఆరోగ్యవంతమైన మార్గాలను రూపొందిస్తుందని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని త్వరలో స్మార్ట్ రింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
* జనవరి 17వ తేదీ 11:30PM గంటలకు ప్రారంభం అయిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తునన శాంసంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్, గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు గెలాక్సీ ఏఐతో వస్తాయి. దీని ద్వారా లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్ వంచి ఫీచర్లు ఉన్నాయి.
గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ల సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1పై పనిచేస్తాయి. 120Hz రిప్రెష్ రేట్‌తో డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేలను కలిగి ఉంది. గెలాక్సీ S24 ఫోన్ 8GB ర్యామ్, ప్లస్, అల్ట్రా ఫోన్‌లు 12GB ర్యామ్‌ను కలిగి ఉంటాయి. S24, S24 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు అల్యూమినియం ఆర్మర్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
అదే S24 అల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1తో పనిచేస్తుంది. 6.8 అంగుళాల ఎడ్జ్ QHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1Hz-120Hz రీప్రెష్ రేట్ సహా 2600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. విజన్ బూస్టర్ ఫీచర్‌తోపాటు, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ జనవరి 31 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అయితే భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ల ధర సహా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








