Samsung కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ డేట్ వచ్చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి
శామ్‌సంగ్ అభిమానులు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ ఎప్పుడు అన్న విషయానికి సంబంధించి శామ్‌సంగ్ కంపెనీ ఈ రోజు అధికారికంగా ధృవీకరించబడింది. ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించడానికి ఆగస్టు 11 న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్‌ను ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేశారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 పేరుతో రాబోయే ఈ రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి టీజర్ స్పష్టంగా సూచిస్తుంది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఖచ్చితంగా ఈవెంట్ యొక్క హైలైట్‌గా మారబోతున్నాయి. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ డేట్ ఆగస్టు 11 తేదీ అని కొంతకాలంగా పుకారు ఉంది. శామ్సంగ్ సంస్థ ఈ పుకార్లకు చెక్ చెబుతూ ఈ రోజు వాటిని ధృవీకరించింది. గత సంవత్సరంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనల మాదిరిగానే వచ్చే నెల అన్ ప్యాక్ కూడా పూర్తిగా వర్చువల్ పద్దతిలో లాంచ్ కానున్నది. శామ్సంగ్ సంస్థ అదే రోజు ఈ ఫోల్డబుల్ ఫోన్‌లతో పాటుగా అదనంగా కొన్ని ఇతర డివైస్ లను కూడా విడుదల చేయబోతోంది. వీటిలో గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ బడ్స్ 2 వంటివి ఉన్నాయి.

శామ్సంగ్ అభిమానులు అధికంగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త గెలాక్సీ జెడ్ పరికరాలు శామ్‌సంగ్ నుండి ఇతర ఫోన్ లకు బిన్నంగా ఉత్తమమైన ఫీచర్లతో ఖచ్చితంగా రూపొందుతున్నాయి అని సమాచారం. ఇందులో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 S పెన్ మద్దతు ఉన్న మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి.

శామ్సంగ్ సంస్థ గతంలో ఇదే ఆగస్టు నెలలో తన సాంప్రదాయక గెలాక్సీ నోట్ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. ఇప్పుడు కూడా ఇదే నెలలో కొత్త గెలాక్సీ నోట్ 21ను విడుదల చేనున్నట్లు కొన్ని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలసి ఉంది. కావున కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎదురుచూడటం చాలా ఉంది. ఇవి మునుపటి ఫోన్ ల కంటే ఎక్కువ మన్నికైన మరియు శక్తివంతమైనవిగా వస్తున్నట్లు భావిస్తున్నారు. గూగుల్‌తో కలిసి శామ్‌సంగ్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త గెలాక్సీ వాచ్ 4 కూడా ఆండ్రాయిడ్ ఆధారిత వేర్ ప్లాట్‌ఫామ్‌లో మొదటిదిగా లాంచ్ కానున్నది.

శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఈవెంట్ లాంచ్ లైవ్ డేట్
శామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ యొక్క ఈవెంట్‌ను ఆగస్టు 11న మీరు శామ్సంగ్.కామ్ మరియు సంస్థ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ చూడవచ్చు. ఈ గెలాక్సీ ఫోల్డబుల్ అన్ ప్యాక్ ఈవెంట్‌ను ఆగస్టు 11 బుధవారం 23:00 KST (10:00 EDT / 15:00 BST) వద్ద సంస్థ ట్యూన్ చేయనున్నది. ఎప్పటిలాగే సామ్‌మొబైల్‌లో ఈవెంట్ యొక్క ఫుల్ కవరేజ్ కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








