Samsung నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా రానున్నాయి!! ఇందులో నిజమెంత...

|

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందిన శామ్సంగ్ సంస్థ వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా తన గెలాక్సీ Z ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే మునుపటి తరం ఫోల్డబుల్ ఫోన్‌ల కంటే గెలాక్సీ Z ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 3 చౌకగా ఉండవచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. నివేదికల ప్రకారం శామ్సంగ్ నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ముందు వాటి కంటే 20 శాతం చౌకగా ఉండబోతున్నట్లు సమాచారం.

 

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధరల వివరాలు

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధరల వివరాలు

శామ్సంగ్ సంస్థ నుండి వచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 $1,999 (సుమారు రూ.1,45,686) ధర వద్ద మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ $ 1,380 (సుమారు రూ.1,00,573) ధరల వద్ద ప్రారంభించబడ్డాయి. ఈ నివేదికలు నిజమైతే కనుక కొత్త ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ $ 1,599 (సుమారు రూ.1,16,517) వద్ద మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 $ 1,104 (సుమారు రూ.80,447) ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

Tata Sky యూజర్లకు రూ.99లకే సెక్యూరిటీ కెమెరా సర్వీస్!! మిస్ చేసుకోకండిTata Sky యూజర్లకు రూ.99లకే సెక్యూరిటీ కెమెరా సర్వీస్!! మిస్ చేసుకోకండి

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌
 

శామ్సంగ్ సంస్థ నుండి వచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలు మరియు ఫీచర్స్ వివరాలు ముందుగానే కొన్ని నివేదికలు విడుదల చేసాయి. వాటి తగ్గ ధరల వద్దనే సంస్థ వాటిని ప్రారంభించాయి. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ నివేదికలు ఫోన్ యొక్క ప్రత్యేకతల గురించి ప్రస్తావించలేదు మరియు కేవలం రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క నిర్దిష్ట ధరను మాత్రమే వెల్లడించాయి. ఈ పరికరాల ధర గురించి కంపెనీ అధికారికంగా ఏమీ వెల్లడించలేదు కాబట్టి ఈ సమాచారాన్ని అధికంగా పరిగణలోకి తీసుకోకూడదు అని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

శామ్సంగ్ తగ్గింపు ధర వద్ద ఎందుకు ప్రవేశపెడుతోంది?

శామ్సంగ్ తగ్గింపు ధర వద్ద ఎందుకు ప్రవేశపెడుతోంది?

ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ నుంచి తరువాతి తరం స్మార్ట్‌ఫోన్‌కు మారడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి శామ్‌సంగ్ సంస్థ తన యొక్క కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధర వద్ద ప్రవేశపెడుతోందని నివేదిక పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికి $1,000 ధర ట్యాగ్ ను కలిగి ఉన్నందున చాలా మందికి ఈ ధర చాలా ఎక్కువ. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని ప్రజలకు ప్రోత్సహించడానికి శామ్సంగ్ ఈ-సిరీస్ వంటి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు సాంకేతికతను తీసుకురావాలి. అయితే ఇది ముందు ముందు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉపయోగించిన ముడి పదార్థాలు ఖరీదైనవి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని ధరలు తగ్గుతాయి.

Best Mobiles in India

English summary
Samsung Upcoming Next-Gen Foldable Smartphones Price 20 percent Cheap

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X