Home
News

Samsung నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ A52,A72 ధరలు లీక్ అయ్యాయి..

భారతదేశంలో లభించే స్మార్ట్‌ఫోన్లలో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ సంస్థ యొక్క గెలాక్సీ సిరీస్ ఫోన్లకు ప్రజలలో అత్యంత ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా ఇందులో గెలాక్సీ A సిరీస్ ఫోన్‌లకు మరింత ఆదరణను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ప్రతి సంవత్సరం కొత్త గెలాక్సీ Aసిరీస్ ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. 2021 కూడా ఈ పరంపరను అనుసరిస్తూ కొత్త ఫోన్‌లను విడుదల చేయనున్నది. రాబోయే వారాల్లో కొత్త గెలాక్సీ A 52 మరియు గెలాక్సీ A72 లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. అయితే లాంచ్ కు ముందే ఈ ఫోన్‌ల ధరలు మరియు ఫీచర్స్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ ఆన్‌లైన్‌ లీక్ లు

శామ్‌సంగ్ గెలాక్సీ ఆన్‌లైన్‌ లీక్ లు

గెలాక్సీ A52 ఫోన్ మార్చి 2021 లో లాంచ్ అవుతున్నట్లు గత నివేదికలలో వెల్లడించింది. అయితే గెలాక్సీ A72 యొక్క లాంచ్ డేట్ విషయం ఇప్పటి వరకు వెల్లడించలేదు. గెలాక్సీ క్లబ్ పేరుతో జర్మన్ వెబ్‌సైట్ లో మొదటిసారిగా వీటి ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులోనే కాకుండా గెలాక్సీ A52 మరియు గెలాక్సీ A72 ధరలు అధికారిక టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వాయిస్ ద్వారా కూడా లీక్ అయ్యాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ఆన్‌లైన్‌ లీక్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ఆన్‌లైన్‌ లీక్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ను మూడు వేరియంట్‌లలో విడుదల చేయనున్నది. ఇందులో 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర Euro 369 (సుమారు రూ. 32,700), టాప్ ఎండ్ 8GB ర్యామ్ / 256GB స్టోరేజ్ మోడల్‌ ధర Euro 429 (సుమారు రూ.38,000) వద్ద విడుదల కానున్నది. అలాగే ఫోన్ యొక్క 5G వేరియంట్ 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ ధర Euro 459 (సుమారు రూ .40,700) ఉండగా, 8GB ర్యామ్ / 256GB స్టోరేజ్ మోడల్ Euro 509 (సుమారు రూ .45,100) ధరను కలిగి ఉంటుందని ఆన్‌లైన్‌ నివేదికలు సూచిస్తున్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఆన్‌లైన్‌ లీక్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఆన్‌లైన్‌ లీక్ ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఫోన్ యొక్క 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క 4G ఆప్షన్ ధర యూరో 449 (సుమారు రూ.39,800) గా ఉండగా 8GB ర్యామ్ / 256GB స్టోరేజ్ ఆప్షన్ యూరో 509 (సుమారు రూ .45,100) ధర వద్ద లభిస్తుంది. గెలాక్సీ A72 యొక్క 5G వేరియంట్ యొక్క ధరలను నివేదిక వెల్లడించలేదు. ఏదేమైనా టిప్స్టర్ డేవిడ్ కోవల్స్కి (@ xleaks7) యొక్క గత నివేదిక ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ A72 5G వేరియంట్ $ 600 (సుమారు రూ.43,900) ధర వద్ద విడుదల అయ్యే అవకాశం ఉంది.

గెలాక్సీ A52, A72 ఆన్‌లైన్‌ లీక్ ఇమేజెస్

గెలాక్సీ A52, A72 ఆన్‌లైన్‌ లీక్ ఇమేజెస్

శామ్‌సంగ్ గెలాక్సీ A52, A72 స్మార్ట్‌ఫోన్ల యొక్క ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటిలో గెలాక్సీ A52 5G యొక్క ముందు మరియు వెనుకవైపు గల ఫోటోలను చూడవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను దీర్ఘచతురస్రాకార ఆకృతిలో కలిగి ఉన్నట్లు రెండర్ వెల్లడించింది. అలాగే గెలాక్సీ A72 5G యొక్క ముందువైపు ప్యానెల్ ఇన్-డిస్ప్లేలో కెమెరాను కలిగి ఉంటుంది. రెండు పరికరాల్లో ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే కేంద్రీకృత హోల్-పంచ్‌తో ఉంటుంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్స్ కుడి అంచున ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Upcoming Smartphones Galaxy A52, Galaxy A72 5G Design, Price Details Leaked in Online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X