ఆపిల్ ఐఫోన్ 5, ఐప్యాడ్ 3లను మాకు చూపించాలి, లేదంటే అంతే...

Posted By: Staff

ఆపిల్ ఐఫోన్ 5, ఐప్యాడ్ 3లను మాకు చూపించాలి, లేదంటే అంతే...

టెక్నాలజీ రంగంలో నెంబర్ వన్ అయినటువంటి శ్యామ్ సంగ్, ఆపిల్ మద్య గత కొంతకాలంగా యుధ్దం జరుగుతున్నమాట నిజమే. ఇలాంటి సందర్బంలో ఈ యుద్దం బాగా ముదిరి పోయింది. ఎక్కడ వరకు ముదిరిపోయింది అంటే సౌత్ కొరియా‌కు సంబంధించిన శ్యామ్ సంగ్ సంస్ధ ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఆపిల్ తర్వాత విడుదల చేసేటటువంటి ఐఫోన్, ఆపిల్‌లకు సంబందించిన వర్సన్స్ మాకు చూపించాలి అని అనేంతగా...

శ్యామ్ సంగ్ లాయర్స్ నార్తరన్ జిల్లాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి యుయస్ జిల్లా కోర్టులో ఆపిల్‌పై కేసు కూడా పెట్టడం జిరిగింది. ఆపిల్ త్వరలో విడుదల చేయబోయేటటువంటి ఐఫోన్ 5, ఐప్యాడ్ 3లను మాకు చూపించాల్సిందేనంటూ కేసువేయడం జిరిగింది. దీనిపై లాయర్స్ మాట్లాడుతూ ఇలా మేము అడగడానికి కారణం జూన్ 13లోపు ఆపిల్ కంపెనీ గనుక ఐపోన్, ఐప్యాడ్‌లకు సంబంధించి ఫైనల్ వర్సన్స్‌ని విడుదల చేసినట్లైతే ఇద్దరి మద్యా ఉన్నటువంటి కన్పూషన్స్ అనేవి తోలగిపోతాయని అన్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో తమ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీలు, ఐఫోన్‌లను శామ్‌సంగ్ కాపీ కొడుతోందంటూ ఉత్తర కాలిఫోర్నియా కోర్టులో కేసు వేసింది. ప్రోడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటివన్నీ మక్కీకి మక్కీ తమ ఉత్పత్తుల్లాగానే ఉన్నాయని యాపిల్ పేర్కొంది. దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పిటీషన్లో వివరించింది.

శామ్‌సంగ్ సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోకుండా యథేచ్ఛగా తమ ఉత్పత్తులను కాపీ కొడుతోందని యాపిల్ ఆరోపించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ఐ9000 మోడల్.. పూర్తిగా తమ ఐఫోన్ 3జీఎస్‌ను పోలి ఉండటాన్ని ఇందుకు నిదర్శనంగా చూపించింది. తాము సొంత టెక్నాలజీపైనే ఆధారపడతామని, అదే తమ విజయ రహస్యమని శామ్‌సంగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot