6000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో శాంసంగ్ 5G ఫోన్.. బుకింగ్‌లు ప్రారంభం
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ F సీరిస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్‌ను జూన్ 6 సాయంత్రం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఫోన్‌ల కోసం ప్రీ బుకింగ్‌ను ఓపెన్ చేసినట్లు పేర్కొంది.
కొన్ని కథనాలు, లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 108MP మెగాపిక్సల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, ఎల్‌ఈడీ ప్లాష్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నైట్ ఫోటోగ్రఫీ, ఆస్ట్రోలాప్స్, నో షేక్ కెమెరా సహా మరెన్నో ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ కెమెరాలతో 4k నాణ్యతతో వీడియోలు రికార్డు చేయవచ్చని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేతో రానుందని సమాచారం. డిస్‌ప్లే పుల్ హెడ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. మరియు ఫోన్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రక్షణ పొందనుందని తెలుస్తోంది.
శాంసంగ్ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ రిటైల్ ధరలోనే ఛార్జర్ కూడా వస్తుందా లేదా అనేది కచ్చితంగా తెలియరాలేదు. గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB ర్యామ్ మరియు 128GB, 256GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులో ఉండనుందని సమాచారం. మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్‌తో రానుంది.
శాంసంగ్ వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.999 నగదు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు రూ.2000 విలువైన ప్రయోజనాలు పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ F54 5G ఫోన్ ధర రూ.28,000 నుంచి 30,000 రూపాయల మధ్య ఉంటుందని సమాచారం. అయితే ఫోన్ రంగు మరియు యాక్ససిరీస్‌ను బట్టి ధరలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
రూ.999 చెల్లించి శాంసంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్ బుక్ చేసుకున్న వారు ఫోన్ ఫీచర్లు, ధర ఏది నచ్చకపోయిన తమ బుకింగ్‌ను రద్దుచేసుకోవచ్చు అని శాంసంగ్ తెలిపింది. బుకింగ్ నగదును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఫోన్ ఆర్డర్ చేసిన సమయంలో బుకింగ్ నగదు రూ.999 తగ్గించి మిగిలిన బిల్లును చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








