శాంసంగ్ నుంచి Apple కు 80 మిలియ‌న్ల డిస్‌ప్లే పానెల్స్‌!

|

Apple సంస్థ iPhone 14 ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ మొబైల్స్‌కు సంబంధించి డిస్‌ప్లే పానెల్స్ నుంచి ఆస‌క్తి క‌ర విష‌యం వెల్ల‌డైంది. iPhone14 మొబైల్స్ త‌యారీకి శాంసంగ్ సంస్థ 80 మిలియ‌న్ల OLED డిస్‌ప్లే పానెల్స్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు కొరియాకు చెందిన ఓ మీడియా న్యూస్ నివేదిక లీకులిచ్చింది.

ఈ ఏడాది యాపిల్‌కు శాంసంగ్ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను (80 మిలియ‌న్ల డిస్‌ప్లేలు) స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఇందు కోసం శాంసంగ్ సంస్థ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది మూడో త్రైమాసికానికి వాటిని యాపిల్‌కు డెలివ‌రీ ఇవ్వ‌నున్న‌ట్లు నివేదిక పేర్కొంది. ఈ డిస్‌ప్లేలు iPhone14 ప్రోతో పాటుగా ఐఫోన్ రెగ్యుల‌ర్ సిరీస్‌ల‌కు కూడా వినియోగించ‌నున్న‌ట్లు స‌మాచారం.

iPhone14 సిరీస్ నుంచి నాలుగు మొబైల్స్‌:

iPhone14 సిరీస్ నుంచి నాలుగు మొబైల్స్‌:

ఈ ఏడాది యాపిల్ iPhone14 సిరీస్‌లో నాలుగు మొబైల్స్ ను విడుద‌ల చేయాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అందులో రెండు iPhone14, iPhone 14 Max రెగ్యుల‌ర్ మోడ‌ల్స్ ఉండ‌గా, మ‌రో రెండు ప్రో మోడ‌ల్స్ iPhone14 Pro, iPhone 14 Pro Max లు ఉండ‌నున్నాయి. ఈ రెండు రెగ్యుల‌ర్ మ‌రియు ప్రో మోడ‌ల్ మొబైల్స్ 6.1 అంగుళాలు , 6.7 అంగుళాల డిస్‌ప్లే సైజుల‌ను క‌లిగి ఉండ‌నున్నాయి. మొత్తం 80 మిలియ‌న్ డిస్‌ప్లే పానెల్స్‌లో 38.17 మిలియ‌న్ పానెల్స్ రెగ్యుల‌ర్ ఐఫోన్ మోడ‌ల్స్‌కు వినియోగించ‌నున్నట్లు నివేదిక‌లోని స‌మాచారం ద్వారా తెలిసింది.

ఈ iPhone 14 సిరీస్‌కు వినియోగించే డిస్‌ప్లే పానెల్స్ త‌యారీలో శాంసంగ్ TFT-based లో టెంప‌రేచ‌ర్ పాలిక్రిస్ట‌లైన్ ఆక్సైడ్ (LTPO), TFT-based లో టెంప‌రేచ‌ర్ పాలి సిలికాన్ (LTPS) ను ఉప‌యోగించ‌నుంది. ఈ డిస్‌ప్లే పానెల్స్ త‌యారీ ప్రాజెక్ట్ చైనా కు చెందిన బీఓఈ సంస్థ చేప‌ట్టాల్సి ఉంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ, డిజైన్ మార్పిడి స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి బీఓఈ సంస్థ ను త‌ప్పించారు. ఐఫోన్ 14 ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో మార్కెట్‌లో విడుద‌ల కానున్న‌ట్లు టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇవి గొప్ప డిస్‌ప్లే పానెల్స్‌తో రానున్న‌ట్లు అంచ‌నాలు వేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత యాపిల్ ఐఫోన్‌లో డిజైన్‌లో మార్పు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

iPhone14 డిస్‌ప్లే ప్ర‌త్యేక‌త‌లు:
 

iPhone14 డిస్‌ప్లే ప్ర‌త్యేక‌త‌లు:

టెక్ విశ్లేష‌కుడు గుర్మాన్ తెలిపిన‌ వివ‌రాల ప్ర‌కారం.. ఐఫోన్ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లోని డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండడానికి వీలుగా కొత్త డిస్‌ప్లే ఫీచర్ ని కంపెనీ తీసుకొనిరానున్నట్లు తెలిపింది. ఆపిల్ వాచ్ సిరీస్ 5 మరియు దాని అప్ గ్రేడ్ మోడల్‌లలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పని చేస్తుంది. సరళంగా చెప్పాలంటే iPhone 14 సిరీస్‌లోని ప్రో మోడల్‌లు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే మోడ్ ప్రారంభించబడినప్పుడు స్క్రీన్ ఫ్రేమ్ రేట్‌ను తగ్గిస్తాయి. తద్వారా అవి తక్కువ బ్యాటరీని వినియోగించుకునేలా చేస్తాయి. ప్రస్తుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే పని చేసే విధానం కూడా ఇదే. ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడళ్లలో కంపెనీ A16 బయోనిక్ చిప్‌సెట్ ని కలిగి ఉండనున్నట్లు మునుపటి నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఆపిల్ సంస్థ మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రో మోడళ్లను ప్రారంభించగలదని కూడా అతను పేర్కొన్నాడు. త్త A16 బయోనిక్ చిప్ కొత్త మరియు మెరుగైన CPU మరియు GPUతో పాటు LPDDR5 RAMకి మద్దతుతో కూడా వస్తుంది.

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు

iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Samsung will supply over 80 million OLED panels for iPhone 14 series

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X