Home
News

Samsung నుంచి ఫోల్డబుల్ టాబ్లెట్ లు & ల్యాప్ టాప్ లు! డిజైన్ వివరాలు

By Maheswara

శాంసంగ్ ఒక సరికొత్త ఫోల్డబుల్ పరికరం పై పని చేస్తోంది. నివేదికల ప్రకారం శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ టాబ్లెట్‌ లను అభివృద్ధి చేస్తోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ధృవీకరించారు మరియు దాని గురించిన కొన్ని డిజైన్ అంశాలను కూడా వెల్లడించారు. కాబట్టి పూర్తి వివరాలు చూద్దాం.

సామ్‌సంగ్ ఫోల్డబుల్ టాబ్లెట్‌ లపై భారీగా పెట్టుబడి పెడుతోంది
ఈ వార్త శాంసంగ్ సంస్థ మొబైల్ హెడ్ T.M రోహ్ నుండి వచ్చింది. గత నెలలో ది ఇండిపెండెంట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సీనియర్ అధికారి ఫోల్డబుల్ టాబ్లెట్‌లతో పాటు ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ల అభివృద్ధిని ధృవీకరించారు.

Samsung Working On Foldable Tablet And Laptop Models, Design Details Here.

"ప్రజలు చదవడానికి పుస్తకాన్ని తెరుస్తారు మరియు ఏదైనా వ్రాయడానికి నోట్‌బుక్‌ను తెరుస్తారు. అవి ఉపయోగించనప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు వాటిని మడతపెట్టి ఉంచవచ్చు, ఇది వాటిని మరింత కాంపాక్ట్ మరియు పోర్టబుల్‌గా చేస్తుంది, అలాగే లోపల ముఖ్యమైన సమాచారాన్ని రక్షిస్తుంది. ఇది మానవ ప్రవర్తనలో సహజమైన భాగం. అని వివరించారు.

ఇంకా, రోహ్ "స్మార్ట్‌ఫోన్‌కు వర్తించే టెక్నాలజీ టాబ్లెట్ మరియు ల్యాప్‌టాప్‌లకు కూడా వ్యాపిస్తుంది. ఆ దిశగా, శామ్‌సంగ్‌లో మేము చాలా వనరులను పెట్టుబడి పెడుతున్నాము. అని తెలియచేసారు. దీని ప్రకారం, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఫోల్డబుల్ టాబ్లెట్‌ లు మరియు ల్యాప్‌టాప్‌ల పై పని చేస్తుందని మరియు వెంచర్‌లో భారీగా పెట్టుబడి పెడుతుందని నిర్దారించుకోవచ్చు.

ల్యాప్‌టాప్ లలో, ఇప్పటికే మనము, Asus Zenbook 17 ఫోల్డ్ OLEDని కలిగి ఉన్నాము, ఇప్పుడు శాంసంగ్ సంస్థ నుండి రాబోయే ఫోల్డబుల్ నోట్‌బుక్‌లు ఈ Asus Zenbook 17 ఫోల్డ్ OLED తో పోటీపడే అవకాశం ఉంది.

మేము శాంసంగ్ నుండి ఫోల్డబుల్ టాబ్లెట్ గురించి వినడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు నివేదికల ప్రకారం గెలాక్సీ Z ఫోల్డ్ ట్యాబ్ మోడల్‌లో పని చేస్తున్నట్లు బ్రాండ్ గురించి గతంలో కూడా నివేదించాము. LetsGoDigital డిజైన్ ప్రకారం మడతపెట్టే టాబ్లెట్‌ ను వివరించే కొన్ని పేటెంట్‌ల వివరాలు విడుదలయ్యాయి. ఇందులో మడత పెట్టె రెండు మెకానికల్ కీలు లు ఉన్నాయి.

ఇంకా ఇతర వివరాలు చూస్తే, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 మరియు గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో ఈ రోజు నుంచి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన తాజా ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌లను ఆ సంవత్సరపు రెండవ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ లాంచ్ ఈవెంట్‌ లో ఆవిష్కరించిన మూడు వారాల తర్వాత. ఈ ఫోన్లు ఆగష్టు 18 న అమ్మకానికి వచ్చాయి.

ఈ ఫోన్‌లు క్వాల్కమ్ యొక్క కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా శక్తిని పొందుతాయి మరియు కొత్త ఫ్లెక్స్ హింజ్‌ని కలిగి ఉంటాయి. గత సంవత్సరం మోడల్‌ తో పోలిస్తే, గెలాక్సీ Z ఫ్లిప్ 5 దాని సమీప ప్రత్యర్థి అయిన మోటోరోలా రేజర్ 40 అల్ట్రా మాదిరిగానే చాలా పెద్ద బాహ్య స్క్రీన్‌తో అమర్చబడింది. శాంసంగ్ సంస్థ కు చెందిన మరిన్ని వార్తల కోసం గిజబోట్ తెలుగు ను అనుసరించండి.

Image Source : LetsGoDigital

Best Mobiles in India

English summary
Samsung Working On Foldable Tablet And Laptop Models, Design Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X