Home
News

ఆపిల్, షియోమికి ఇండియాలో షాకిచ్చిన శాంసంగ్

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రోజు రోజుకు వార్ నువ్వా నేనా అని సాగుతున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు నంబర్ వన్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.

By Hazarath Aiah

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రోజు రోజుకు వార్ నువ్వా నేనా అని సాగుతున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు నంబర్ వన్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఎప్పటి నుంచో నంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్‌ను చైనా దిగ్గజం షియోమి ఢీకొట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ ఇండియాలో శాంసంగ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

 మరోసారి తన అగ్రస్థానాన్ని..

మరోసారి తన అగ్రస్థానాన్ని..

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తనకు ఎదురులేదని నిరూపించుకున్న శాంసంగ్‌ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

ఒక్కశాతం మాత్రమే ..

ఒక్కశాతం మాత్రమే ..

రెండు కంపెనీల అమ్మకాల్లో మధ్య కేవలం ఒక్కశాతం మాత్రమే తేడా ఉండడం గమనార్హం.

శాంసంగ్‌ 29 శాతం వాటా

శాంసంగ్‌ 29 శాతం వాటా

ఈ ఏడాది రెండో త్రైమాసికానికి గానూ శాంసంగ్‌ 29 శాతం వాటాను సాధించగా.. షియోమి 28 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్‌ పాయింట్‌ పేర్కొంది.

ఆపిల్‌ కేవలం 1 శాతం వాటా

ఆపిల్‌ కేవలం 1 శాతం వాటా

ఇదే సమయంలో ఆపిల్‌ కేవలం 1 శాతం వాటాను మాత్రమే పొందడం గమనార్హం. ఇక వివో 12 శాతం, ఒప్పో 10శాతం, హానర్‌ 3 శాతం మార్కెట్‌ వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

టాప్‌-5 కంపెనీల వాటా 82శాతం

టాప్‌-5 కంపెనీల వాటా 82శాతం

మొత్తం మొబైల్‌ అమ్మకాల్లో టాప్‌-5 కంపెనీల వాటా 82శాతమని కౌంటర్‌ పాయింట్‌ పేర్కొంది.

‘జే' సిరీస్‌ ఫోన్‌ అమ్మకాలే

‘జే' సిరీస్‌ ఫోన్‌ అమ్మకాలే

శాంసంగ్‌ అగ్రస్థానానికి చేరుకోవడానికి తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన ‘జే' సిరీస్‌ ఫోన్‌ అమ్మకాలే సహకరించాయని, దీనికితోడు ఆఫ్‌లైన్‌ డిస్ట్రిబ్యూషన్‌, మార్కెటింగ్‌ వ్యూహాలు ఇందుకు సహకరించాయని తెలిపింది.

మూడు నెలల కాలంలో

మూడు నెలల కాలంలో

కాగా, మొత్తం మొబైల్‌ అమ్మకాలు రెండంకెల వృద్ధిని (18శాతం) సాధించాయని పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో వన్‌ప్లస్ 284 శాతం, హానర్‌ 188శాతం, షియోమి 112 శాతం అమ్మకాల వృద్ధిని సాధించాయి.

గెలాక్సీ జే6, గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ జే6, గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శాంసంగ్భా రత్‌లో మరోమారు తన సత్తాను చాటుకుని ఇండియాని నంబర్ వన్ స్థానం నిలబెట్టుకోవడానికి గెలాక్సీ జే6, గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌లు బాగా సహకరించాయి. 

సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్పెసిఫికేషన్స్..

సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 40 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే6 స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ జే6 స్పెసిఫికేషన్స్

5.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్), 3000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, ఫోన్ బరువు 154 గ్రాములు.

ధర

ధర

సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేలతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లకు చాట్-ఓవర్-వీడియో ఫీచర్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. మార్కెట్లో గెలాక్సీ జే8 ధర రూ.18,990గా ఉంది. మరో మోడల్ అయిన గెలాక్సీ జే6 (64జీబి, 32జీబి) వేరియంట్స్ ధరలు రూ.15,990, రూ.13,990లుగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Passes Xiaomi to Lead Smartphone Market Shipments in India in Q2 2018: Counterpoint More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X