Home
News

ఇక్కడే కొనుగోలు చేయండి.. పండుగ సీజన్‌ సేల్స్‌ సందర్భంగా శాంసంగ్‌, షియోమీ, రియల్‌మి సంస్థల కీలక ప్రకటన..!

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సేల్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌ ప్రారంభం కానున్నాయి. ఈ రెండు సేల్స్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్స్‌ లో స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌, ఇతర గ్యాడ్జెట్స్‌ సహా గృహోపకరణాలపై డిస్కౌంట్స్‌ ను పొందవచ్చు.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ :
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌ లో భాగంగా SBI కార్డు యూజర్లు 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ప్రత్యేక డీల్స్‌, నో కాస్ట్ EMI సహా అనేక డీల్స్‌ అందుబాటులో ఉండనున్నాయి.

samsung  xiaomi  realme revealed official sellers

* బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ :
అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, VIP మెంబర్లు కూడా 24 గంటల ముందుగానే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ లో పొల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ICICI, యాక్సెస్‌ బ్యాంకు యూజర్లు 10 శాతం డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేల్స్‌ ఎన్ని రోజులపాటు నిర్వహించనున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే పండుగల సీజన్‌లో ఆఫర్‌లతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ ఉత్పత్తుల విక్రయాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక మంది ప్రజలు ఇలాంటి సేల్స్‌ సమయాల్లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సేల్స్‌ను ఉపయోగించుకొని, కొంత మంది మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.

* ప్రముఖ సంస్థల కీలక ప్రకటన :
నకిలీ ఉత్పత్తులను, అప్పటికే ఉపయోగించిన ఉత్పత్తులను, డ్యామేజీ అయిన ఉత్పత్తులను కొంత మంది విక్రయిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ సంస్థలు శాంసంగ్, రియల్‌మి, షియోమీ వంటి సంస్థలు కీలక ప్రకటన చేశాయి. అధికారిక సెల్లర్స్‌ జాబితాను విడుదల చేశాయి.

* శాంసంగ్ :
శాంసంగ్‌ అందించిన డేటా ఆధారంగా ఫ్లిప్‌కార్ట్‌ లో ఫ్లాష్‌ స్టార్‌ కామర్స్, BTPLD, మైథన్‌ గ్లోరీ రిటైల్, ట్రాకామ్‌ రిటైల్‌ తమ అధికారిక సెల్సర్స్‌గా పేర్కొంది. అదే అమెజాన్‌ లో దర్షిత రిటైల్‌, క్లిక్‌టెక్‌ రిటైల్‌, STPL ఎక్స్‌క్లూజివ్‌ ను తమ అధికారిక సెల్లర్స్‌గా పేర్కొంది.

* రియల్‌మి :
మరో ప్రముఖ సంస్థ రియల్‌మి కూడా తన అధికారిక సెల్లర్స్‌ జాబితాను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో విజన్‌స్టార్‌, BTPL, TAMS, సూపర్‌కాం, Patpritrade MPS, MPD, Truene, srasra, sthenios, ecommerce, grahgoods, xonight వంటి అధికారిక సెల్లర్స్ పేర్లను విడుదల చేసింది. అమెజాన్‌లో దర్షిత ఈటెల్ ను తమ అధికారిక సెల్లర్‌గా ప్రకటన చేసింది.

* షియోమీ :
మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌, గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ షియోమీ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. అమెజాన్‌లో గ్రీన్‌ మొబైల్స్‌, దర్షిత మొబైల్స్‌ను తమ అధికారిక సెల్లర్స్‌గా పేర్కొంది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో అక్షనవ్‌, మైథన్‌గ్లోరీ పేర్లను అధికారికంగా ప్రకటించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung, xiaomi, realme revealed official sellers details ahead of festival sale seasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X