చైనా ఫోన్లకు శాంసంగ్ దిమ్మతిరిగే షాక్..

By Hazarath
|

చైనా ఫోన్లకు శాంసంగ్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లతో మార్కెట్లోకి దూసుకుపోతున్న చైనా కంపెనీలకు శాంసంగ్ తన కొత్త టెక్నాలజీ ద్వారా అదిరిపోయే దెబ్బ కొట్టనుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇప్పుడు విజయవంతం కావడంతో దానికి మరింతంగా మెరుగులు దిద్ది రానున్న ఫోన్లలో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

యూజర్లకు ఆర్‌కామ్ షాక్, బిగ్ టీవి అవుట్యూజర్లకు ఆర్‌కామ్ షాక్, బిగ్ టీవి అవుట్

శాంసంగ్ researchers కొత్త టెక్నాలజీతో..

శాంసంగ్ researchers కొత్త టెక్నాలజీతో..

ఇప్పటిదాకా మార్కెట్లో lithium-ion batteriesతో ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శాంసంగ్ researchers కొత్త టెక్నాలజీతో బ్యాటరీ ఫాస్ట్ అయ్యే విధానాన్ని కనుగొన్నారు.

గ్రఫెనీ బాల్‌

గ్రఫెనీ బాల్‌

ఈ టెక్నాలజీ పేరు గ్రఫెనీ బాల్‌. ఈ టెక్నాలజీ ద్వారా ధారణ ఛార్జింగ్‌ సమయంతో పోలిస్తే ఐదు రెట్లు వేగంగా ఫోన్ ఛార్జ్‌ కానుంది. దీంతో పాటు బ్యాటరీ సామర్థ్యం కూడా 45 శాతం పెరగనుంది.

సిలికాన్‌, ఇతర పదార్థాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా..

సిలికాన్‌, ఇతర పదార్థాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా..

శాంసంగ్‌ తీసుకొచ్చే కొత్త బ్యాటరీని ఆలోట్రోఫ్‌ ఆఫ్‌ కార్బన్‌ సమ్మేళనం కలిగిన గ్రఫెనీ మెటీరియల్‌తో తయారు చేయనున్నారు. సిలికాన్‌, ఇతర పదార్థాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా దీన్ని వినియోగించనున్నారు. వీటిని ఎక్కువగా ప్రాసెసర్లు, బ్యాటరీల్లో ఉపయోగిస్తారు.

చైనా ఫోన్లు దూసుకెళ్తున్న నేపథ్యంలో..
 

చైనా ఫోన్లు దూసుకెళ్తున్న నేపథ్యంలో..

మొబైల్ మార్కెట్లో చైనా ఫోన్లు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ శాంసంగ్‌కు మరింత కలిసి రానుంది. ‘తర్వాతి తరం స్మార్ట్‌ఫోన్లకు శాంసంగ్‌ గ్రఫెనీ బాల్‌ టెక్నాలజీ మరింత బలం చేకూర్చునుంది' అని శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎస్‌ఏఐటీ పరిశోధకులు

ఎస్‌ఏఐటీ పరిశోధకులు

శాంసంగ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎస్‌ఏఐటీ) పరిశోధకులు, శాంసంగ్‌ ఎస్‌డీఐ, సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ కెమికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి.

మొబైల్‌ డివైజ్‌లకే పరిమితం కాకుండా..

మొబైల్‌ డివైజ్‌లకే పరిమితం కాకుండా..

కేవలం మొబైల్‌ డివైజ్‌లకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల్లోనూ దీన్ని వినియోగించనున్నారు. ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికినట్లే నిపుణులు అంటున్నారు .

Best Mobiles in India

English summary
Samsung's 'graphene ball' battery could lead to fast-charging EVs More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X