Home
News

ఇక వంటల పుస్తకాలు అక్కర్లేదు.. శామ్‌సంగ్ టీవీలే చెప్తాయ్ రెసిపీలు!

By Ram Kumar

ఇష్టమైన టీవీ షో చూస్తున్నారా? అందులో ఏదైనా వంటకం బాగా నోరూరిస్తోందా? కానీ దాన్ని ఎలా తయారు చేయాలో తెలియక డిసప్పాయింట్ అవుతున్నారా.. ఇకపై అలా నిరుత్సాహపడాల్సిన పనే లేదు! ఎందుకంటే... శామ్‌సంగ్ సరికొత్త ఫీచర్‌తో మీ కోరిక వెంటనే నెరవేరబోతోంది.

సరికొత్త 2025 టీవీ మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన "శామ్‌సంగ్ ఫుడ్" అనే ఫీచర్, స్క్రీన్‌పై కనిపించే ఆహార పదార్థాలను గుర్తించి, వాటి తయారీకి సంబంధించిన వంటకాలను క్షణాల్లో మీ ముందు ఉంచుతుంది.

Samsung s New TVs Can Now Find Recipes from Shows

ఎప్పుడైనా నచ్చిన వంటల ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు, తెరపై కనిపించే ఆకర్షణీయమైన వంటకాన్ని చూసి "ఇది నేను స్వయంగా చేస్తే ఎంత బాగుంటుందో" అని చాలామంది అనుకుంటారు. లేదా మీ అభిమాన టీవీ షోలో ఎవరైనా ఒక ప్రత్యేకమైన వంటకాన్ని చేస్తుంటే, దాని రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. మనసులోని ఆ కోరికలను నిజం చేసే శక్తి ఈ సరికొత్త టీవీ ఫీచర్‌కు ఉంది.

లాస్ వెగాస్‌లో జరిగిన CES 2025 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శామ్‌సంగ్ ఈ అద్భుతమైన ఫీచర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఫుడ్ ఫీచర్, కంపెనీకీ చెందిన అత్యాధునిక AI ప్రాసెసర్‌ను ఉపయోగించి స్క్రీన్‌పై ఉన్న ఆహార పదార్థాలను గుర్తిస్తుంది. ఆ వెంటనే వాటికి సంబంధించిన రెసిపీస్ సూచిస్తుంది.

వాస్తవానికి ఈ ఫీచర్, శామ్‌సంగ్ 2019లో కొనుగోలు చేసిన "విస్క్" అనే యాప్‌కు విస్తరణ. తర్వాత 2023లో శామ్‌సంగ్ ఆ యాప్‌ను "శామ్‌సంగ్ ఫుడ్"గా పేరు మార్చింది.

* యాప్ వీరికి అవైలబుల్

ప్రస్తుతం, శామ్‌సంగ్ ఫుడ్ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోవడానికి, AI సూచనలతో వంట చేయడానికి అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, మీరు నెలకు 7 డాలర్లు చెల్లించి ప్రీమియం వెర్షన్ తీసుకుంటే, మీరు ఫొటో తీసిన ఆహారం ఆధారంగా కూడా వంటకాలను సూచిస్తుంది.

* టీవీ ఫీచర్ పనిచేస్తుందిలా

టీవీలో ఉండే శామ్‌సంగ్ ఫుడ్ ఫీచర్ మాత్రం కాస్త పరిమితంగా ఉంటుంది. మొబైల్ యాప్‌లో ఉన్న అన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇందులో ఉండవు. కానీ, ఇది కూడా మీకు ఎంతో సహాయపడుతుంది. టీవీ స్క్రీన్‌పై ఆహారాన్ని గుర్తించిన వెంటనే, దానికి సంబంధించిన వంటకాన్ని సిఫార్సు చేస్తుంది. అంతేకాదు, మీరు శామ్‌సంగ్ ఫుడ్ మొబైల్ యాప్ ద్వారా గ్రాసరీ లేదా టేక్‌అవుట్ ఆర్డర్ చేస్తే, ఆ ఆర్డర్ ఎక్కడ వరకు వచ్చిందో కూడా టీవీ స్క్రీన్‌పై చూపిస్తుంది.

ఈ ఫీచర్‌లో శామ్‌సంగ్ ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమిటంటే, మీ ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలను బట్టి షాపింగ్ లిస్ట్ తయారుచేసే సామర్థ్యం. ఇది మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోవడానికి, మీకు కావలసిన పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది.

శామ్‌సంగ్ ఈ ఫీచర్‌ను "మీ సొంత AI సూ చెఫ్" లాంటిదని చెబుతోంది. నిజమే, ఈ AI మీకు వంటకాల విషయంలో, షాపింగ్ లిస్ట్ విషయంలో సహాయం చేస్తుంది. కానీ, వంట మాత్రం మీరే చేసుకోవాలి.

ఒకవేళ మీరు వంట చేయడం లేదా భోజనం కోసం ముందుగా సిద్ధం చేసుకోవడం ఇష్టం లేని వారైతే, ఈ ఫీచర్ మిమ్మల్ని వంటగదిలోకి రప్పించకపోవచ్చు. కానీ, మీరు బేకింగ్ అంటే ఇష్టపడేవారైతే లేదా కొత్త వంటకాలను ప్రయత్నించాలనుకునే వారైతే, ఈ ఫీచర్ మీ వంటగదికి ఒక సరదా అదనంగా ఉంటుంది.

శామ్‌సంగ్ ఫుడ్ ఫీచర్ త్వరలో రాబోయే QN90F, QN80F, QN70F టీవీ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెటింగ్‌లో చేస్తున్న వాగ్దానాలను ఈ ఫీచర్ ఎంతవరకు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung's 2025 TVs feature Samsung Food, which uses AI to identify food on-screen and suggest recipes. It integrates with Samsung's mobile app for shopping lists, meal planning, and order tracking.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X