శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ఏదైనా దొరకనుందా..?

Posted By: Staff

  శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ఏదైనా దొరకనుందా..?

 

స్మార్ట్ ఫోన్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న శాంసంగ్ కొత్తగా ఇండియాలో 'ఈస్టోర్' పేరుతో ఆన్‌లైన్ స్టోర్స్‌ని ప్రవేశపెట్టింది. 'ఈస్టోర్'లలో శాంసంగ్‌కు చెందిన మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్ టాప్స్‌కు సంబంధించి ఉత్పత్తులను విక్రయించనున్నామని తెలిపారు.  'ఈస్టోర్' లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను డబ్బుని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యాష్ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.

ఎమ్‌ఆర్‌పి ధరలతో పోల్చితే  'ఈస్టోర్' లలో కొనుగోలు చేసిన ఉత్పత్తుల ధరలు కాస్త తక్కువగానే ఉండనున్నాయని సమాచారం. అదే వేరే ఆన్‌లైన్  స్టోర్స్ అయిన 'లెట్స్‌బై', 'ఫ్లిప్ కార్ట్' లాంటి వాటితో పోల్చితే ధరలు మాత్రం తక్కువగా లేవు.  'ఈస్టోర్' కు సంబంధించి కస్టమర్ సపోర్ట్ నెంబర్ (1800 103 8384) టోలీ ఫ్రీ నెంబర్‌తో పాటు.. ఈమెయిల్ అడ్రస్‌ని వినియోగదారల కొసం అందుబాటులో ఉంచారు.

శాంసంగ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆన్‌లైన్ స్టోర్‌కు చెందిన లింక్ ఇవ్వబడింది. వీటితో పాటు ఆన్‌లైన్ రిటైలర్స్ వెబ్‌సైట్స్ లెట్స్ బై లాంటి వాటి లింక్స్ కూడా అందుబాటులో ఉంచారు. గత కొంత కాలం నుండి కూడా లెట్స్ బై వెబ్‌సైట్ శాంసంగ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. శాంసంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ లతో పాటు వినియోగదారులక పనికివచ్చే అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot