మీడియాకు చిక్కిన జాకీచాన్ కొత్త ప్రేయసి!

Posted By: Super

మీడియాకు చిక్కిన జాకీచాన్ కొత్త ప్రేయసి!

 

హాలీవుడ్ యాక్టర్ జాకీచాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంటా. జాకీచాన్ చిత్రాలంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా హాస్యాన్ని పండించడం ఆయనకే చెల్లింది. వివరాల్లోకి వెళితే... తాజాగా ఆయన కొత్త ప్రేయసి మీడియాకు చిక్కింది. ప్రేయసి అంటే వేరుగా అర్ధం చేసుకోకండి. స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్ జాకీచాన్ కోసం ‘ఎస్ సీహెచ్- డబ్ల్యూ2013’ పేరుతో డ్యూయల్ కోర్, డ్యూయల్ స్ర్కీన్ ఫ్లిప్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. ఓ ఛారిటీ కార్యక్రమంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. ధర అంచనా రూ.160776 నుంచి రూ.177962 మధ్య.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డ్యూయల్ స్ర్కీన్స్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకోవచ్చు, 1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot