శాన్‌డిస్క్ మొబైల్ మెమెరీ కార్డ్స్!

Posted By: Staff

శాన్‌డిస్క్ మొబైల్ మెమెరీ కార్డ్స్!

 

ప్రముఖ అంతర్జాతీయ డేటా స్టోరేజ్ పరికరాల నిర్మాణ సంస్థ శాన్‌‍డిస్క్, అత్యంత వేగవంతంగా స్పందించే మైక్రోఎస్డీ మొబైల్ మెమెరీ కార్డులతో పాటు పెన్‌డ్రైవ్‌లను కాలిఫోర్నియాలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. వాటి వివరాలు...

మైక్రో ఎస్‌డి కార్డ్:

ఎక్స్ ట్రీమ్ ప్రో (8 జీబి వర్షన్) : రూ.2,599.

ఎక్స్ ట్రీమ్ ప్రో (16జీబి వర్షన్): రూ. 4,699 (ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ మెమరీ కార్డు),

ఇవి కాకుండా నాగులు యూఎస్బీ పెన్‌డ్రైవ్‌లను శాన్‌డిస్క్ లాంచ్ చేసింది. వాటి ధరలు రూ.259 నుంచి రూ.5,189 మధ్య ఉంటాయి. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో వీటిని విడుదల చెయ్యనున్నారు.

క్లారిటీ వేటలో గుగూల్.. ఆపిల్!

లండన్: టెక్నాలజీ దిగ్గజం గుగూల్, తాను ప్రవేశపెట్టిన ఏరియల్ మ్యాపింగ్ కు మరింత స్పష్టతను జోడించే క్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన 20 విమానాలను రంగంలోకి దింపింది. ఈ టెక్నాలజీ అందుబాటులోలేని ఆపిల్ సంస్థ ‘స్పై ఇన్ ద స్కై’ టెక్నాలజీ కలిగిన సి3 టెక్నాలజీస్ సంస్థకు తన ఏరియల్ మ్యాపింగ్ ప్రాజెక్టును అప్పజెప్పింది. ఆ సంస్థ ఇప్పటికే లండన్ సహా 20 నగరాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది.

ఇదంతా ఎందుకంటే… ఇప్పటిదాకా ఈ సంస్థలు రూపొందించిన ఏరియల్ మ్యాపులను జూమ్‌చేస్తే పూర్తివివరాలు స్పష్టంగా కనిపించవు. ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగానే.. అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదుల జాడను పసిగట్టి లక్ష్యాల్ని ఛేదించేందుకు అమెరికన్ నిఘా వర్గాలు వాడిన శక్తిమంతమైన టెక్నాలజీతో సరితూగే పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఇలా తీసే చిత్రాలను జూమ్‌చేసినా నాణ్యత తగ్గదు. నాలుగు అంగుళాల సమీపందాకా దేన్నయినా స్పష్టంగా చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot