శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ త్వరలోనే ఆపిల్ బ్రాండ్ లో అందుబాటులోకి రానున్నది!!

|

శాటిలైట్ కమ్యూనికేషన్స్(శాట్‌కామ్) అనేది కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సహకారాలలో ఒకటిగా మారుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే కనెక్టివిటీని అందించడానికి శాట్‌కామ్ నెట్‌వర్క్‌లకు ప్రతిచోటా ఆప్టికల్ ఫైబర్‌ల ఉనికి అవసరం లేదు. శాటిలైట్ నెట్‌వర్క్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచంలోని మారుమూల ప్రదేశాలలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడానికి వీలుగా ఉంటుంది.

 

ఆపిల్

ఆపిల్ సంస్థ నుంచి ఇకమీదట రాబోయే ఆపిల్ వాచ్‌లో శాటిలైట్ కనెక్టివిటీని అందించే పనిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆపిల్ వాచ్‌ ఈ సంవత్సరం చివర్లో లేదా 2023 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనితో పాటుగా అదనంగా ఐఫోన్ 14 సిరీస్ పరికరాలు కూడా శాటిలైట్ కనెక్టివిటీకి మద్దతుని కలిగి ఉండే అవకాశం కూడా ఉంది.

Realme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్, సేల్స్ వివరాలుRealme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్, సేల్స్ వివరాలు

టెలికాం మార్కెట్‌పై శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రభావం

టెలికాం మార్కెట్‌పై శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రభావం

స్టార్‌లింక్, వన్‌వెబ్ మరియు అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ వంటి కంపెనీలు గ్లోబల్ శాట్‌కామ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దీని కోసం వారు ఇప్పటికే అంతరిక్షంలో భూ కక్ష్యకు దగ్గరగా (LEO) ఉపగ్రహాల కూటమిని నిర్మించడం ప్రారంభించారు. మార్క్ గుర్మాన్ యొక్క పవర్ ఆన్ న్యూస్ లెటర్ ప్రకారం ఆపిల్ 4G లేదా 5G (భూగోళ) నెట్‌వర్క్‌ల అవసరం లేకుండా వాయిస్ కాల్‌లు మరియు మెసేజ్లను ప్రారంభించడానికి LEO ఉపగ్రహ కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది.

శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ
 

ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ టెక్నాలజీ అనేది మొదటగా ఐఫోన్ 13 సిరీస్‌లో ప్రదర్శించబడుతుందని భావించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆపిల్ సంస్థ నుంచి త్వరలోనే రాబోయే ఐఫోన్ 14 సిరీస్‌లో ఈ కనెక్టివిటీని తీసుకొనిరావాలని దృష్టి కేంద్రీకరించబడింది. ఇది LEO శాటిలైట్ కనెక్టివిటీకి మద్దతుతో మార్కెట్ లోకి రాబోయే మొదటి ఐఫోన్‌ మోడల్ కావచ్చు. దీనితో పాటుగా ఈ సంవత్సరంలోనే LEO శాటిలైట్ కనెక్టివిటీకి మద్దతుతో ఆపిల్ బ్రాండ్ యొక్క కొత్త వాచ్‌లు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆపిల్

ఆపిల్ సంస్థ ఇప్పుడు కొత్తగా ఆపిల్ మాక్ కోసం M3 చిప్‌సెట్‌పై కూడా పని చేస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 2023 చివరి నాటికి అప్ డేట్ చేయబడి iMac మోడల్‌తో ప్రారంభించబడుతుంది. 2022 సంవత్సరంలో శక్తివంతమైన M2 చిప్‌సెట్‌తో కొత్త మ్యాక్‌బుక్‌లను విడుదల చేయనున్నది. యాపిల్ సంస్థ M2 చిప్‌సెట్‌తో కనీసం తొమ్మిది వేర్వేరు మ్యాక్‌లపై పని చేస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్, 14-అంగుళాల మరియు 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో లు కూడా ఉన్నాయి. Apple WWDC (వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) 2022 జరిగిన తర్వాత వీటిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం మరికొన్ని రోజులు వేచిఉండాలి.

Best Mobiles in India

English summary
Satellite Internet Connectivity Might Arrive Soon on Apple Watch and iPhone 14 Series Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X