మాదాపూర్‌లో సెజ్ ఏర్పాటుకి మరింత సమయం కోరిన మహీంద్రా సత్యం

Posted By: Staff

మాదాపూర్‌లో సెజ్ ఏర్పాటుకి మరింత సమయం కోరిన మహీంద్రా సత్యం

మహీంద్రా సత్యం ఇక్కడి మాదాపూర్‌లో ప్రతిపాదిత ఐటీ, ఐటీఈఎస్ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు కోరింది. కంపెనీ ఇప్పుడిప్పుడే రికవరీ బాటన పయనిస్తోందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సమయం కావాలంటూ వాణిజ్య శాఖకు చెందిన సెజ్‌ల అనుమతుల బోర్డుకు(బీవోఏ) మహీంద్రా సత్యం తెలిపింది. ఇప్పటికే మంత్రిత్వ శాఖ కంపెనీకి రెండుసార్లు గడువు పొడిగించింది.

చివరి గడువు తేదీ జూన్ 19తో ముగుస్తుంది. కాగా, విశాఖపట్నం తోట్లకొండ హిల్స్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌ను డీనోటిఫై చేయాలన్న మహీంద్రా సత్యం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం బీవోఏకు పంపించింది.

ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నావికాదళానికి బదలాయించిందని, ఇక్కడ వైర్‌లెస్ ఎక్స్‌పెరిమెంటల్ యూనిట్ ఏర్పాటు కానుందని, దీంతో సెజ్ డీనోటిఫై చేయాలని మహీంద్రా సత్యం కోరింది. సెజ్ ఏర్పాటుకై సత్యంకు మరోచోట 50 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot