Home
News

మొబైల్ బిల్లుల మోతకు చెక్.. రోజుకి రూ.4.15కే 365 రోజుల పాటు డైలీ 2GB డేటా..

BSNL: BSNL తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఏడాది మొత్తం రోజుకి 2GB డేటా పొందొచ్చు. అది కూడా చాలా తక్కువ ధరలో, ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవాళ్లకి, డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ ప్లాన్ మంచి ఛాయిస్. జస్ట్ రూ.1,515 పెడితే 365 రోజుల పాటు రోజుకి 2GB డేటా వస్తుంది. అంటే రోజుకి అయ్యే ఖర్చు కేవలం రూ.4.15 మాత్రమే.

ఇంత తక్కువ ధరలో ఇంత డేటా ఇంకెక్కడా దొరకదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS బెనిఫిట్స్ మాత్రం లేవు. BSNL ఈ ప్లాన్ గురించి X (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధర, ఎక్కువ కాలం వాలిడిటీ ఈ ప్లాన్ ప్రత్యేకతలు. ఈ రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది.

Say Goodbye to High Mobile Bills  Get 2GB Daily Data for Just Rs 4 15 per Day with This New 365-Day Plan

ఒకవేళ రోజుకి 2GB డేటా అయిపోతే స్పీడ్ కాస్త తగ్గి 40kbpsకి వస్తుంది. కానీ ఇంటర్నెట్ మాత్రం ఆగదు. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, సోషల్ మీడియా వాడేవాళ్ల కోసం ఈ ప్లాన్ పర్ఫెక్ట్. కాలింగ్, SMS లేవు కాబట్టి, వాట్సాప్, VoIP కాల్స్ లాంటివి వాడేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్.

* మరో యాన్యువల్ ప్లాన్ రూ.1,198కే

రూ.1,515 ప్లానే కాదు, BSNL ఇంకో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. అది రూ.1,198 ప్లాన్. ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్ రెండూ ఉన్నాయి. నెలకి 3GB హై-స్పీడ్ డేటా, నెలకి 300 నిమిషాల ఫ్రీ కాలింగ్, 35 SMSలు కూడా ఫ్రీగా ఇస్తారు.

ఈ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డేటాతో పాటు కాలింగ్ కూడా కావాలనుకునేవాళ్లకి ఈ ప్లాన్ బెస్ట్. అది కూడా ఏడాది మొత్తం తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ కావాలనుకుంటే దీనికి మించింది లేదు. దీంతో చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

* మరిన్ని తక్కువ ధర ప్లాన్లు

కొద్ది రోజుల క్రితమే BSNL ఇంకో రెండు చవక ప్లాన్లను లాంచ్ చేసింది. కానీ ఈ ప్లాన్స్‌లో డేటా ఉండదు. కొన్ని సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ డేటా కన్నా కాలింగ్ ఎక్కువ అవసరమున్న వాళ్ల కోసం తెచ్చారు. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఇస్తారు.

* Vi 5G ట్రయల్స్ షురూ..

ఇదిలా ఉండగా, Vi (వొడాఫోన్ ఐడియా) ముంబైలో 5G ట్రయల్స్ స్టార్ట్ చేసింది. సెలెక్టెడ్ కస్టమర్లకు టెస్టింగ్ కోసం అన్‌లిమిటెడ్ డేటా ఇస్తోంది. కొంతమంది యూజర్లు స్క్రీన్‌షాట్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. కంపెనీ ఈ ట్రయల్ గురించి వాళ్లకి మెసేజ్ పంపించిందంట.

* జియో, ఎయిర్‌టెల్ ఇయర్లీ ప్లాన్స్

జియో ఏకంగా రెండు 365 రోజుల ప్లాన్స్‌ అందిస్తోంది. మొదటి ప్లాన్ ధర రూ.2,999. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకి 2.5GB డేటా వస్తుంది. ఇంకో ప్లాన్ రూ.3,599. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2.5GB డేటాతో పాటు రెండు OTT సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా ఇస్తున్నారు.

ఎయిర్‌టెల్ రూ.1,849 నుంచి రూ.3,999 వరకు రకరకాల ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తోంది. డేటా లిమిట్స్ మారుతూ ఉంటాయి కానీ, అన్ని ప్లాన్స్‌లోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, SMSలు మాత్రం కామన్. అంతేకాదు, వింక్ మ్యూజిక్, డిస్నీ+ హాట్‌స్టార్‌, అపోలో 24/7 మెంబర్‌షిప్ లాంటి బెనిఫిట్స్ కూడా కొన్ని ప్లాన్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఏ ప్లాన్ కావాలో మీ అవసరానికి తగ్గట్టు ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL offers 2GB daily data yearly plan for Rs 1515 (Rs 4.15/day). Another plan at Rs 1198 includes 3GB data and calling. Vi starts 5G trials in Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X