‘12-12-12’...రజనీకాంత్ స్పెషల్!

Posted By: Staff

 ‘12-12-12’...రజనీకాంత్ స్పెషల్!

 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి తెలియని దక్షిణాది సినీ ప్రియులు ఉండరు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సైతం పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ఆయన. ఆసియాలోనే జాకీచాన్‌ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్‌ పేరు తెచ్చుకున్నారు. ఏటా డిసెంబర్ 12 వచ్చిందంటే చాలు రజనీ అభిమానులకు పండుగే పండుగ. ఈ ఏడాది సూపర్ స్టార్ జన్మదినోత్సవం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.  ఈ శతాబ్థానికే గొప్పరోజుగా ‘12-12- 12’ను పలువురు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి గడియల్లో రజనీ తన 62వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవటం అద్భుతం. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్  ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో మమేకమవుతున్న సూపర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా 575,936మంది ఫేస్‌బుక్ అభిమానులున్నారు. సినిమారంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న సూపర్ స్టార్‌కు ఫేస్‌బుక్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపాలనుందా..?, అయితే వెంటనే రజనీ ఫ్యాన్ క్లబ్‌లో చేరి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలపింది. సూపర్‌స్టార్ ఫేస్‌బుక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot