ఏటిఎమ్‌లలో డబ్బు తీయాలంటే లైడిటెక్టర్‌కు సమాధానం చెప్పాల్సిందే

Posted By: Staff

ఏటిఎమ్‌లలో డబ్బు తీయాలంటే లైడిటెక్టర్‌కు సమాధానం చెప్పాల్సిందే

మాస్కో: బ్యాంకింగ్‌రంగంలో విప్ల వాత్మక మార్పులను తీసుకొచ్చినవి ఏటిఎమ్‌లు. విని యోగదారులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి అవసరాల మేర డబ్బును సమకూరుస్తున్నాయి. ని జానికి ఈ ఒక్క పని మూలంగానే బ్యాంకర్లకు భారీగా పని గంటలు కలిసి వస్తుండగా, ఆర్థిక లావాదేవీలు సైతం వేగంగా జరుగుతున్నాయి. అయితే వినియోగదారులకు ఖచ్చితమైన సేవలను అందిస్తున్న ఈ ఏటిఎమ్‌లలో మరి న్ని సంచలనాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ మార్పులను రష్యన్‌ బ్యాంకింగ్‌ రంగం తొలిసారిగా పరిచయం చేస్తుండగా..బ్యాంకింగ్‌ రంగ లావాదేవీలను మరింత పారదర్శకంగా, లాభసాటిగా చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.

రష్యా ప్రభుత్వరంగ బ్యాంకైన స్బెర్‌ బ్యాంక్‌.. ప్రయో గాత్మకంగా ఓ ఏటిఎమ్‌లో లైడిటెక్టర్‌ను అమర్చింది. ఈ ఏటిఎమ్‌ను వినియోగించేవారిని అడిగేందుకు పలు ప్రశ్నలను సైతం ముందుగానే స్బెర్‌ బ్యాంక్‌ రికార్డు చేసింది. అంతేగాక వినియోగదారుని గొంతును గుర్తించేందుకు వీలుగా ఏర్పాట్లను కూడా చేసింది. అలాగే వినియోగదా రుడు ఏటిఎమ్‌ వద్దకు రాగానే ఇందులోని కెమెరా ఎదురుగా ఉన్న వ్యక్తికి సంబంధించి ఓ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో గ్రాఫ్‌తోపాటు వివిధ కోణాల్లో మూడు ఫోటోలను తీసి భద్రపరుస్తుంది. ఈ ఫోటోల కార్యక్రమం అంతా విని యోగదారుడు క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే ప్రారంభమై క్షణాల్లో ముగుస్తాయని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే క్రెడిట్‌ కార్డు సై్వప్‌ చేసిన వెంటనే ఏటిఎమ్‌లో ముందుగా అమర్చిన రికార్డింగ్‌ మెషీన్‌ మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఏవైనా లోన్లు తీసుకున్నా రా? అనే ప్రశ్నలను సంధిస్తుందని పేర్కొంటున్నాయి. ఈ ప్రశ్నలకు వచ్చే సమధానాన్ని వాయిస్‌ రికార్డర్‌ రికార్డు చ ేస్తుందని ఈ వివరాలు తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తా మని తెలిపాయి. అయితే ఈ విధానం ప్రస్తుతం ప్రయో గం దశలో ఉందని, ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్‌లు, షాపింగ్‌మాల్స్‌, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని స్బెర్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

స్బెర్‌ బ్యాంక్‌ చేస్తున్న ఈ ప్రయోగానికి కారణాలు లేక పోలేదు. అతి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలను కుంటున్న ఈ ఏటిఎమ్‌లతో బ్యాంకింగ్‌ లావాదేవీలలో అక్రమాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకునే వీలుంటుంద ని, మరెన్నో లాభాలుంటాయని స్బెర్‌ బ్యాంక్‌ స్పష్టం చే స్తోంది. ప్రధానంగా ఇంతకుముందు లోన్లు తీసుకుని ఎగ వేతకు పాల్పడినవారు ఈ ఏటిఎమ్‌లను వినియోగించ డం ద్వారా వారి క్రేడిట్‌కార్డుల ఆధారంగా పట్టుకోవచ్చని, అంతేగాక పోలీసుల విచారణ సమయంలో రికార్డు చేసిన నేరగాళ్ల గొంతు తమ ఏటిఎమ్‌లలో రికార్డైన గొంతు సరి పోయిన పక్షంలో అటోమెటిక్‌గా దగ్గర్లోని పోలీసులకు స మాచారం అందించే వీలుందని, దీని వలన చోరీలకు ఆ స్కారం ఉండదనే అభిప్రాయాన్ని స్బెర్‌ బ్యాంక్‌ వ్యక్తం చేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot