SBI బ్యాంక్ IMPS లావాదేవీ పరిమితులు, ఛార్జీలు మారనున్నాయి!! ఎప్పటినుంచో తెలుసా??
ఇండియాలో బ్యాంకింగ్ రంగంలో గల అనేక సంస్థలలో SBI ఒకటి. ప్రభుత్వ ఉద్యోగులు అధిక శాతం మంది తమ యొక్క శాలరీ అకౌంట్ కోసం SBI ని మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా మంది తమకు మరొక అకౌంట్ ఉన్నప్పటికీ తమ యొక్క అవసరాల కోసం SBI లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇష్టపడతారు. బ్యాంకింగ్ రంగంలో తక్షణ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా చేసే లావాదేవీలకు SBI కొత్తగా కొన్ని ఛార్జీలను అమలు చేస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త లావాదేవీల రేట్ల ప్రకారం బ్యాంకు ఖాతాదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SBI IMPS లావాదేవీ పరిమితి
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(SBI) అమలు చేయబడే అతిపెద్ద మార్పులలో ఒకటి లావాదేవీ పరిమితి. SBI ఇప్పుడు IMPS ద్వారా రూ.5 లక్షల వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. మునుపటి పరిమితి కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఉండేవి. ఈ లావాదేవీలను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా కూడా మరింత సులభంగా చేయవచ్చు.

SBI ఆఫ్‌లైన్ IMPS లావాదేవీ ఛార్జీలు
ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేసే IMPS లావాదేవీలకు SBI కొన్ని కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. లావాదేవీలు చేసేందుకు బ్యాంకు శాఖకు వెళ్లే ఖాతాదారులు కింద తెలిపే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
** SBI కొత్త IMPS ఛార్జీల ప్రకారం రూ.1000 వరకు అన్ని ఆఫ్‌లైన్ లావాదేవీల అభ్యర్థనలకు ఎటువంటి ఛార్జీలు విధించబడదు. అయితే రూ.1,000 నుండి రూ. 10,000 వరకు చేసే లావాదేవీల కోసం కస్టమర్ నుండి రూ.2 మరియు GST వసూలు చేయబడుతుంది. అలాగే రూ.10,000 నుండి రూ. 1,00,000 పరిధిలో చేసే లావాదేవీల మీద ఖాతాదారులు రూ.4 మరియు GST ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది.
** అలాగే రూ.1,00,000 నుండి రూ.2,00,000 వరకు జరిగే ప్రతి లావాదేవీకి ఎస్‌బిఐ బ్యాంక్ ఖాతాదారులు రూ.12 మరియు జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. SBI ప్రవేశపెట్టిన కొత్త స్లాబ్‌లో రూ.2,00,000 నుండి రూ. 5,00,000 వరకు చేసే ప్రతి లావాదేవీల మీద ఖాతాదారులు రూ.20 మరియు GST చెల్లించాలి.

SBI ఆన్‌లైన్ IMPS లావాదేవీ ఛార్జీలు
** ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేసే IMPS లావాదేవీలకు భిన్నముగా అన్ని ఆన్‌లైన్ IMPS లావాదేవీలు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఈ లావాదేవీలపై బ్యాంక్ ఎటువంటి GST ఛార్జీలను కూడా విధించదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు YONO అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసే అన్ని IMPS లావాదేవీలకు మినహాయింపు ఉంటుంది.
** SBI బ్యాంక్ తన ఖాతాదారులను వారి బ్యాంకింగ్ అవసరాల కోసం ఆన్‌లైన్ మాధ్యమాన్ని అనుసరించేలా ప్రోత్సహించాలని కోరుతున్నందున ఆన్‌లైన్ లావాదేవీలకు మినహాయింపు ఇవ్వబడింది.

అంతకుముందు జనవరిలో SBI విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం "డిజిటల్ బ్యాంకింగ్‌ను అనుసరించేలా కస్టమర్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో, రూ.5 లక్షల వరకు IMPS లావాదేవీలపై SBI ఎటువంటి సర్వీస్ ఛార్జీలను విధించలేదు. YONOతో సహా ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. బ్రాంచ్ ఛానెల్‌ల విషయానికొస్తే ప్రస్తుత స్లాబ్‌లలో బ్రాంచ్ ఛానెల్ ద్వారా చేసే IMPS సర్వీస్ ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు.


Click it and Unblock the Notifications








