వావ్.. ఎస్‌బిఐ కార్డ్స్‌తో పనిలేకుండా నేరుగా మొబైల్ పేమెంట్స్

By Gizbot Bureau
|

ఎస్‌బిఐ కార్డు వాడేవారికి కంపెనీ శుభవార్తను అందించింది. ఇకపై ఎక్కడికి వెళ్లినా షాపింగ్ చేసే సమయంలో కార్డు స్వైప్ అవసరం లేకుండా పిన్ నంబర్ అవసరం లేకుండా నేరుగా మొబైల్ పేమెంట్స్ సదుపాయాన్ని అందిస్తోంది. 'SBI Card Pay’ పేరుతో కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీ మొబైల్ ఫోన్లతో పాయింట్ ఆఫ్ సేల్స్ (PoS) మిషన్ల దగ్గర కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై Wi-Fi సింబల్ ఉన్న కార్డులను కాంటాక్ట్ లెస్ కార్డులు అంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్డులతో నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ఎనేబుల్ అయిన పాయింట్ ఆఫ్ సేల్ (PoS)టెర్నినల్స్ దగ్గర ఫిజిల్ క్రెడిట్ కార్డు, PIN ఎంటర్ చేయకుండానే మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఎస్బీఐ కార్డు పే ఫీచర్ హోస్ట్ కార్డ్ ఎమ్యులేషన్ (HCE) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను VISA ప్లాట్ ఫాంపై మాత్రమే లాంచ్ చేసింది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది 
 

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది 

ఈ సదుపాయం VISA కార్డుకి మాత్రమే. SBI కార్డుదారులు.. తమ ఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ SBI Card మొబైల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.తమ కార్డుపై One-Time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.ఒకసారి కార్డు రిజిస్టర్ అయ్యాక యూజర్లు తమ ఫోన్ స్క్రీన్ Unlock చేసుకోవాల్సి ఉంటుంది.PoS మిషన్ల దగ్గరకు మీ మొబైల్ డివైజ్ తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడే మొబైల్ పేమెంట్స్ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో..

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో..

ఆండ్రాయిడ్ ఫోన్లలో (ఆండ్రాయిడ్ OS KitKat వెర్షన్ 4.4 ఆపై) ఉంటేనే సపోర్ట్ చేస్తుంది.రూ.2వేల కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే 4 అంకెల PIN ఎంటర్ చేయక్కర్లేదు. రోజులో రూ.2వేల పరిమితి దాటాక.. ప్రతి టాన్సాక్షన్ కు స్వైప్, 4-పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజులో గరిష్టంగా మీ కార్డునుంచి రూ.10వేల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ప్రయోజనాలు 

ప్రయోజనాలు 

వేగవంతంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. కార్డును డిప్పింగ్ లేదా స్వైపింగ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు.కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ సమయంలో మీ చేతిలో కార్డును వదిలేయకూడదు. కార్డు కోల్పోవడం, మోసాలు, స్కిమ్మింగ్ మోసాలకు అవకాశం ఉండదు. VISA/MasterCard కాంటాక్ట్ లెస్ కార్డులకు ఏకైక బుల్ట్ ఇన్ సీక్రెట్ కీ ఉంటుంది.

కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ సెక్యూర్
 

కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ సెక్యూర్

ప్రతి టాన్సాక్షన్ సమయంలో ప్రతి వీసా/మాస్టర్ కార్డు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ సెక్యూర్ ఉంటుంది.NFC టెక్నాలజీ యాక్టివేట్ అయిన PoS మిషన్లు ఉన్న అన్ని మర్చంట్ షాపుల్లో కార్డు పనిచేస్తుంది. NFC మెథడ్ ద్వారా పేమెంట్ ఎన్ క్రిప్టడ్ ఫార్మాట్ లో ఉండటంతో పూర్తి భద్రతగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
SBI Card launches contactless mobile phone payments facility

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X