ఎస్‌బిఐ డెబిడ్ కార్డు మరచిపోయారా, ఈ విధంగా డబ్బులు డ్రా చేసుకోండి

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఏటీఎంకార్డు లేకుండా నేరుగా ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునే సేవలను ప్రారంభించింది. కార్డులేకుండా డబ్బులు డ

|

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఏటీఎంకార్డు లేకుండా నేరుగా ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునే సేవలను ప్రారంభించింది. కార్డులేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. ఈ మేరకు ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా 'యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశవ్యాప్తంగా 16,500కుపైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి సంస్థగా ఎస్‌బీఐ అవతరించింది. మరి ఎలా డ్రా చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

ఎస్‌బిఐ డెబిడ్ కార్డు మరచిపోయారా, ఈ విధంగా డబ్బులు డ్రా చేసుకోండి

యోనో క్యాష్ పాయింట్స్

ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్‌బీఐ. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది.

 నెట్ బ్యాంకింగ్

నెట్ బ్యాంకింగ్

నెట్ బ్యాంకింగ్ ఈ సౌకర్యాన్ని మీరు పొందడానికి ముందుగా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ బ్యాంకు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయచ్చు. ఒక్కసారి వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకుంటే వారికీ ఓటీపీ వస్తుంది. ఇది మన ఎటిఎం పిన్ నెంబర్ లాగా ఉంటుంది. దీనిని లావాదేవీల పిన్ లాగా లేదా అధికార కోడ్ గా కూడా ఉపయోగ పడుతుంది

బ్యాంకు అకౌంట్ యాప్

బ్యాంకు అకౌంట్ యాప్

రిజిస్టర్ ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ లో మీకు ఉన్న బ్యాంకు అకౌంట్ యాప్ మొబైల్లో డౌన్ లోడ్ చేసుకోవాలి ఈ వినియోగదారులకి ఎస్ఎంఎస్ ఎంపిక కూడా వస్తుంది. దీని ద్వారా ఈ యాప్ యొక్క వెబ్ లింక్ మీ మొబైల్ కు వస్తుంది. ఈ సేవ డెబిట్ కార్డు లేకుండా డబ్బులు తీయడానికి పూర్తిగా ఉచితం. మరో ఆప్సన్ యోనో యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

YONO యాప్ డౌన్‌లోడ్,
యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది.2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.

 

ఆరు అంకెల యోనో క్యాష్ పిన్

ఆరు అంకెల యోనో క్యాష్ పిన్

యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.

యోనో క్యాష్ పాయింట్‌కు

యోనో క్యాష్ పాయింట్‌కు

మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. పిన్‌, రిఫరెన్స్‌ సంఖ్య వచ్చిన 30 నిమిషాల్లోగా నగదు ఉపసంహరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.ఇలా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం.

 

 

Best Mobiles in India

English summary
SBI customers can withdraw money from an ATM without a debit card

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X