మీరు SBI కస్టమరా,ఇకపై అన్ని బ్యాంకుల్లో సేవలు పొందవచ్చు

By Gizbot Bureau
|

దేశంలో ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులూ చాలానే ఉన్నాయి. అయితే ఈ బ్యాంకులన్నీ ఒక బ్యాంక్ కస్టమర్‌కు వేరొక బ్యాంక్ లో సేవలు అందించవు. ఏ బ్యాంక్ కస్టమర్ ఆ బ్యాంక్‌లోనే ఎలాంటి సర్వీసులు అయినా పొందే అవకాశముంది. అయితే ఇకపై ఇలా కాకుండా ఒక బ్యాంక్ కస్టమర్ మరొక బ్యాంకుకు వెళ్లి బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. ఈ దిశగా బ్యాంక్ కస్టమర్లకు మోదీ ప్రభుత్వం తీపికబురు అందించాలని చూస్తోంది.

SBI customers may soon access services free

రానున్న రోజుల్లో ఒక బ్యాంక్ కస్టమర్ మరొక బ్యాంకుకు వెళ్లి బ్యాంకింగ్ సేవలు పొందే వెసులుబాటు అందుబాటులోకి రావొచ్చు. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

 నిర్మలా సీతారామన్ ప్రసంగం

నిర్మలా సీతారామన్ ప్రసంగం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలో బ్యాంకింగ్ వ్యవస్థను కస్టమర్లకు మరింత చేరువచేస్తామని ప్రకటించారు. ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్, డోర్‌స్టెప్ బ్యాంకింగ్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్‌కు ఇతర గవర్నమెంట్ బ్యాంకుల్లో సేవలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

 ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం

ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం

ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) కస్టమర్లు ఇతర బ్యాంకుల్లో సేవలు పొందడానికి వీలులేదు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే బడ్జెట్‌లో డిజిటల్ లావాదేవీల పెంపునకు తగిన చర్యలు తీసుకున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ప్రోత్సాహకాలు, నగదు లావాదేవీలపై పెనాల్టీలు వంటివి కూడా ప్రకటించారు.

రుణ రేట్ల 0.05 శాతం తగ్గింపు

రుణ రేట్ల 0.05 శాతం తగ్గింపు

ఇదిలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ రేట్ల తగ్గుదల ఇది మూడోసారి కావడం గమనార్హం. ఎంసీఎల్ఆర్ రుణ రేట్ల 0.05 శాతం తగ్గింపు నేటి నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటు తగ్గింపు కారణంగా ఎస్‌బీఐ కూడా తన రుణ రేట్లను తగ్గించింది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన రుణాల వడ్డీ రేట్లు దిగివస్తాయి. ఇప్పుడు ఎంసీఎల్ఆర్ 8.4 శాతంగా ఉంది. ఇదివరకు ఇది 8.45 శాతం. తాజాగా ఎంసీఎల్ఆర్ తగ్గింపును కూడా లెక్కలోకి తీసుకుంటే ఏప్రిల్ 10 నుంచి ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గాయి. వరుసగా మూడు సార్లు రెపో రేటు (75 బేసిస్ పాయింట్లు) తగ్గించామని, బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు త్వరగా బదిలీ చేయాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ రుణ రేట్ల తగ్గింపు ప్రాధాన్యం సంతరించుకుంది.

రేట్ల కోతకు అవకాశం

రేట్ల కోతకు అవకాశం

మరోవైపు ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమావేశం ఆగస్ట్ 5-9 మధ్యలో జరగనుంది. ఇందులోనూ రేట్ల కోతకు అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఎస్‌బీఐ డిపాజిట్ల విలువ రూ.29 లక్షల కోట్లు. హోమ్ లోన్స్, వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు ఏకంగా 35 శాతం మార్కెట్ వాటా ఉంది.

Best Mobiles in India

English summary
SBI customers may soon access services across PNB, BoB, other PSBs FREE!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X