10,000 ATM సెంటర్లలో సోలార్ పేనల్స్ ను నెలకొల్పనున్న SBI

పర్యావరణ పరిరక్షణ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 10 వేల ATM సెంటర్లలో విద్యుత్ అవసరాల కోసం సోలార్ పేనల్స్ నెలకొల్పనుంది.

|

పర్యావరణ పరిరక్షణ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 10 వేల ATM సెంటర్లలో విద్యుత్ అవసరాల కోసం సోలార్ పేనల్స్ నెలకొల్పనుంది.ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1200 ATM మెషీన్స్‌లో సోలార్ పేనల్స్ వినియోగిస్తోంది.

దేశవ్యాప్తంగా 1200 ATM  మెషీన్స్‌లో సోలార్ పేనల్స్....

దేశవ్యాప్తంగా 1200 ATM మెషీన్స్‌లో సోలార్ పేనల్స్....

ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1200 ATM మెషీన్స్‌లో సోలార్ పేనల్స్ వినియోగిస్తోంది. రాబోయే రెండేళ్ల కాలం 10 వేల ATM సెంటర్లలో సోలార్ పేనల్స్ ను నెలకొల్పోతున్నట్టు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ తాజాగా వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు....

దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు....

అంతే కాదు దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు నిర్వహించబడుతున్న 250 భవనాలపై రాబోయే ఏడాది కాలంలో సోలార్ పేనల్స్ ని అమర్చబోతోంది ఈ బ్యాంక్.

2030నాటికి బ్యాంకుకు సంబంధించిన అన్ని......

2030నాటికి బ్యాంకుకు సంబంధించిన అన్ని......

దాంతోపాటు 2030నాటికి బ్యాంకుకు సంబంధించిన అన్ని వాహనాలు పెట్రోల్, డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే ఆలోచనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. కర్బన రహిత వ్యవస్థలో తాము పాలు పంచుకోవడం కోసం ఈ చర్యలు చేపట్టనున్నట్లు SBI తెలిపింది.

దేశవ్యాప్తంగా 15 నగరాల్లో.....

దేశవ్యాప్తంగా 15 నగరాల్లో.....

దేశవ్యాప్తంగా 15 నగరాల్లో సెప్టెంబర్ 30 నుండి గ్రీన్ మారధాన్ నిర్వహించబోతున్నట్లు SBI వెల్లడించింది.

 ఏటీఎం సెంటర్లను మూసివేయటం వినియోగదారులను....

ఏటీఎం సెంటర్లను మూసివేయటం వినియోగదారులను....

ఏటీఎం సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్యానల్స్ అమర్చడం మాట అటు ఉంచితే, దేశవ్యాప్తంగా నిర్వహణ వ్యయం పెరుగుతోంది అంటూ ముందస్తు ఎలాంటి హెచ్చరిక లేకుండా ATM సెంటర్లను మూసివేయటం వినియోగదారులను చాలా ఇబ్బంది పెడుతోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై SBI మరింత దృష్టి పెడితే బాగుంటుంది అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Best Mobiles in India

English summary
SBI to install solar panels over 10,000 ATMs in 2 yrs.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X